ఇంద్రజిత్‌ అజేయ సెంచరీ

ఇంద్రజిత్‌ అజేయ సెంచరీ - Sakshi


ఇండియా ‘రెడ్‌’ 291/9 

‘బ్లూ’తో దులీప్‌ ట్రోఫీ మ్యాచ్‌   
కాన్పూర్‌: బాబా ఇంద్రజిత్‌ (181 బంతుల్లో 120 బ్యాటింగ్‌; 12 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీతో కదం తొక్కడంతో ఇండియా ‘బ్లూ’తో జరుగుతున్న దులీప్‌ ట్రోఫీ మ్యాచ్‌లో ఇండియా ‘రెడ్‌’ తొలి రోజు గౌరవప్రదమైన స్కోరు సాధించింది. బుధవారం ఆట ముగిసే సమయానికి రెడ్‌ 9 వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది. ఓపెనర్లు ప్రియాంక్‌ పాంచల్‌ (36; 3 ఫోర్లు), సుదీప్‌ ఛటర్జీ (34; 4 ఫోర్లు, ఒక సిక్స్‌) తొలి వికెట్‌కు 70 పరుగులు జతచేశారు.‘రెడ్‌’ జట్టు తరఫున ఆడుతున్న హైదరాబాద్‌ క్రికెటర్‌ సీవీ మిలింద్‌ తొమ్మిది పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. బ్లూ బౌలర్లలో అంకిత్‌ రాజ్‌పుత్‌ 3 వికెట్లు పడగొట్టగా, ఉనాద్కట్‌కు 2 వికెట్లు దక్కాయి. ప్రస్తుతం ఇంద్రజిత్‌తో పాటు విజయ్‌ గోహిల్‌ (22) క్రీజ్‌లో ఉన్నారు. వీరిద్దరు చివరి వికెట్‌కు అభేద్యంగా 86 పరుగులు జోడించారు. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top