రజతం సాధించిన భారత వెయిట్‌లిఫ్టర్ | Indias Pradeep Singh Wins Silver At Commonwealth Games | Sakshi
Sakshi News home page

రజతం సాధించిన భారత వెయిట్‌లిఫ్టర్

Apr 9 2018 7:56 AM | Updated on Apr 9 2018 10:55 AM

Indias Pradeep Singh Wins Silver At Commonwealth Games - Sakshi

వెయిట్‌లిఫ్టర్ ప్రదీప్ సింగ్

గోల్డ్‌కోస్ట్ : ఆస్ట్రేలియాలో జరుగుతున్న కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత్ తన హవా కొనసాగిస్తోంది. సోమవారం (భారత కాలమానం ప్రకారం) ఉదయం భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. భారత వెయిట్‌లిఫ్టర్ ప్రదీప్ సింగ్ రజతం సాధించారు. 105 కేజీల విభాగంలో పాల్గొన్న ప్రదీప్ 352 కేజీల బరువెత్తి రెండో స్థానంలో నిలిచి భారత్‌ ఖాతాలో మరో పతకం చేర్చారు. స్నాచ్‌లో 152 కేజీలు, క్లీన్ అండ్ జర్క్‌లో 200 కేజీలు ఎత్తారు. సమోవాకు చెందిన సనేలే మావో 360 కేజీలు ఎత్తి స్వర్ణాన్ని కైవసం చేసుకున్నాడు. ఇంగ్లండ్‌కు చెందిన ఓయిన్ బాక్సాల్ 351 కేజీల బరువులెత్తి మూడో స్థానంలో నిలిచి కాంస్యంతో సరిపెట్టుకున్నాడు. దీంతో ఇప్పటివరకూ కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌ ఏడు స్వర్ణాలు, మూడు రజతాలు, మూడు కాంస్యాలతో కలిపి మొత్తం 13 పతకాలు సాధించింది.    

Advertisement
 
Advertisement
Advertisement