వార్మప్‌ మ్యాచ్‌లో జయభేరి | Indian womens team won the World Cup match champions West Indies. | Sakshi
Sakshi News home page

వార్మప్‌ మ్యాచ్‌లో జయభేరి

Nov 6 2018 3:27 AM | Updated on Nov 6 2018 3:27 AM

Indian womens team won the World Cup match champions West Indies. - Sakshi

కూలిడ్జ్‌: టి20 ప్రపంచకప్‌ సన్నాహక మ్యాచ్‌లో భారత మహిళల జట్టు... డిఫెండింగ్‌ చాంపియన్, ఆతిథ్య వెస్టిండీస్‌పై విజయం సాధించింది. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా విండీస్‌ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. హేలీ మాథ్యూస్‌ (37 బంతుల్లో 41; 5 ఫోర్లు, 1 సిక్స్‌) మాత్రమే రాణించింది. రాధా యాదవ్‌ (2/13), పూనమ్‌ యాదవ్‌ (2/17), తెలుగమ్మాయి అరుంధతి రెడ్డి (2/36) ప్రత్యర్థిని కట్టడి చేశారు. వర్షం కారణంగా భారత్‌ లక్ష్యాన్ని 12 ఓవర్లలో 75 పరుగులుగా నిర్దేశించారు. మిథాలీ రాజ్‌ (0), జెమీమా రోడ్రిగ్స్‌ (1), తాన్యా భాటియా (5) విఫలమైనా... స్మృతి మంధాన (20 బంతుల్లో 32; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (25 బంతుల్లో 18; 2 ఫోర్లు) నిలవడంతో భారత్‌ మరో 3 బంతులు ఉండగానే ఐదు వికెట్లు కోల్పోయి 77 పరుగులు చేసి గెలుపొందింది. 

మహిళల క్రికెట్‌పై పుస్తకం... 
‘ది ఫైర్‌ బర్న్స్‌ బ్లూ; ఎ హిస్టరీ ఆఫ్‌ ఉమెన్స్‌ క్రికెట్‌ ఇన్‌ ఇండియా’ శీర్షికన భారత్‌లో మహిళల క్రికెట్‌ ప్రస్థానంపై ఓ పుస్తకం రానుంది. స్పోర్ట్స్‌ జర్నలిస్టులు కారుణ్య కేశవ్, సిద్ధాంత పట్నాయక్‌ రచించిన ఈ పుస్తకం ఈ నెల 30న మార్కెట్‌లో విడుదల కానుంది. వెస్ట్‌లాండ్‌ పబ్లికేషన్స్‌ ముద్రిస్తోంది. 1970ల నుంచి నేటి వరకు మహిళల క్రికెట్‌ ప్రస్థానాన్ని ఇందులో వివరించనున్నారు. లుపు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement