భారత మహిళల హాకీ జట్టు విరాళం రూ. 20 లక్షలు | Indian Womens Hockey Team Donates Rs 20 Lakhs | Sakshi
Sakshi News home page

భారత మహిళల హాకీ జట్టు విరాళం రూ. 20 లక్షలు

May 5 2020 4:57 AM | Updated on May 5 2020 4:57 AM

Indian Womens Hockey Team Donates Rs 20 Lakhs - Sakshi

బెంగళూరు: కరోనాపై పోరాటం కోసం భారత మహిళల హాకీ జట్టు సహాయం అందించింది. 18 రోజుల పాటు ఫిట్‌నెస్‌ సవాళ్లతో సేకరించిన రూ.20 లక్షలను... కరోనా బాధితులకు సాయపడుతున్న ఢిల్లీకి చెందిన ఎన్‌జీఓ సంస్థ ఉదయ్‌ ఫౌండేషన్‌కు అందజేసింది. ఆ సంస్థ ఈ డబ్బును వలస కూలీలు, అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న వారి కోసం ఉపయోగించనుంది. విరాళాలు సేకరించడానికి భారత హాకీ ప్లేయర్లు రోజుకు ఒకరు చొప్పున సామాజిక మాధ్యమంలో ఒక ఫిట్‌నెస్‌ చాలెంజ్‌ను విసిరి... ఆ చాలెంజ్‌ను స్వీకరించవలసినదిగా 10 మందిని నామినేట్‌ చేసేవారు. చాలెంజ్‌ను స్వీకరించిన ఆ పది మంది రూ.100 చొప్పున విరాళంగా ఇచ్చేవారు. అలా ఈ చాలెంజ్‌ మే 3వ తేదీ వరకు సాగింది. ‘మంచి పనిని ఆదరించడంతో పాటు అందులో భాగస్వామ్యం అయిన ప్రతి ఒక్కరికీ మహిళల హాకీ జట్టు తరఫున కృతజ్ఞతలు’ అని జట్టు కెప్టెన్‌ రాణి రాంపాల్‌ పేర్కొంది.   

Advertisement
 
Advertisement
Advertisement