భారత మహిళల ‘ఎ’ జట్టు కెప్టెన్‌ మేఘన

Indian women 'A' team captain Meghna - Sakshi

ముంబై: ముక్కోణపు టి20 సిరీస్‌ సన్నాహాల్లో భాగంగా... ఇంగ్లండ్‌ మహిళల టి20 జట్టుతో జరిగే రెండు వార్మప్‌ మ్యాచ్‌ల్లో పాల్గొనే భారత మహిళల ‘ఎ’ జట్టును ప్రకటించారు. 14 మంది సభ్యులతో కూడిన ఈ జట్టుకు ఆంధ్రప్రదేశ్‌ అమ్మాయి సబ్బినేని మేఘన కెప్టెన్‌గా ఎంపికైంది. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన వికెట్‌ కీపర్‌ రావి కల్పన, హైదరాబాద్‌ అమ్మాయి అరుంధతి రెడ్డిలకు కూడా ఈ జట్టులో చోటు లభించింది. ఈనెల 18, 19వ తేదీల్లో ముంబైలో వార్మప్‌ మ్యాచ్‌లు జరుగుతాయి. అనంతరం భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య 22 నుంచి 31 వరకు ముక్కోణపు టోర్నమెంట్‌ జరుగుతుంది.  

భారత మహిళల ‘ఎ’ జట్టు: సబ్బినేని మేఘన (కెప్టెన్‌), వనిత, హేమలత, మోనికా దాస్, తరన్నుమ్‌ పఠాన్, ప్రియాంక ప్రియదర్శిని, అరుంధతి రెడ్డి, రావి కల్పన (వికెట్‌ కీపర్‌), రాధా యాదవ్, కవితా పాటిల్, శాంతి కుమారి, ప్రీతి బోస్, షెరాల్‌ రొజారియో, హర్లీన్‌. 

Advertisement
Advertisement
Back to Top