పేస్ ‘సెంచరీ’ | Indian tennis Granollers Leander Paes | Sakshi
Sakshi News home page

పేస్ ‘సెంచరీ’

Jun 23 2015 12:13 AM | Updated on Sep 3 2017 4:11 AM

భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ మరో అరుదైన ఘనతను సాధించనున్నాడు. సోమవారం మొదలైన ఎగాన్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో

డబుల్స్‌లో తన 100వ భాగస్వామిగా గ్రానోలెర్స్
నాటింగ్‌హమ్: భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ మరో అరుదైన ఘనతను సాధించనున్నాడు. సోమవారం మొదలైన ఎగాన్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో పేస్ పురుషుల డబుల్స్‌లో తన 100వ కొత్త భాగస్వామితో బరిలోకి దిగనున్నాడు. ఈ టోర్నీలో స్పెయిన్‌కు చెందిన మార్సెల్ గ్రానోలెర్స్‌తో పేస్ జత కట్టనున్నాడు. 1991లో ప్రొఫెషనల్‌గా మారిన పేస్ ఇప్పటివరకు డబుల్స్‌లో 99 మంది భాగస్వాములతో వివిధ టోర్నమెంట్లలో పాల్గొన్నాడు. కెరీర్‌లో 702 మ్యాచ్‌ల్లో గెలిచిన పేస్, 55 డబుల్స్ టైటిల్స్ సాధించాడు.
 

Advertisement
 
Advertisement
Advertisement