ప్రధానిని కలిసిన పేస్‌ | Tennis legend Leander Paes meets PM Narendra Modi | Sakshi
Sakshi News home page

ప్రధానిని కలిసిన పేస్‌

Apr 2 2026 5:36 AM | Updated on Apr 2 2026 5:36 AM

Tennis legend Leander Paes meets PM Narendra Modi

న్యూఢిల్లీ: టెన్నిస్‌ దిగ్గజం లియాండర్‌ పేస్‌ బీజేపీలో చేరిన మరుసటి రోజే ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. భేటీ వివరాలను బుధవారం ప్రధాని మోదీ స్వయంగా తన సామాజిక మాధ్యమ ‘ఎక్స్‌’ ఖాతాలో పోస్ట్‌ చేశారు. ‘‘లియాండర్‌ పేస్‌తో భేటీ గొప్పగా జరిగింది. టెన్నిస్‌లో ఆయన సాధించిన విజయాలు, చేసిన కృషితో దేశం ఎంతో గర్విస్తోంది. ప లు అంశాలపై ఇద్దరం మాట్లాడుకున్నాం. క్రీడలు, దేశంపై ఆయనకున్న అంకితభావం నన్ను ముగ్ధుడిని చేసింది’’ అంటూ పేస్‌తో దిగిన ఫొటోను ప్రధాని షేర్‌చేశారు. గతంలో తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీలో సేవలందించిన లియాండర్‌ పేస్‌ మంగళవారం కేంద్రమంత్రుల సమక్షంలో బీజేపీ తీర్థంపుచ్చుకున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement