ఆస్ట్రేలియాను కంగుతినిపించిన భారత జట్టును ప్రశంసలతో ముంచెత్తిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రోత్సాహకాలు ప్రకటించింది.
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాను కంగుతినిపించిన భారత జట్టును ప్రశంసలతో ముంచెత్తిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రోత్సాహకాలు ప్రకటించింది. కోహ్లి సేన సభ్యులకు రూ. 50 లక్షల చొప్పున నజరానా ఇవ్వనుంది. కోచ్ కుంబ్లేకు రూ. 25 లక్షలు, ఇతర సహాయ సిబ్బందికి రూ. 15 లక్షల చొప్పున పారితోషికాల్ని అందజేయనుంది. ‘టెస్టుల్లో అగ్రస్థానం నిలబెట్టుకున్న టీమిండియాకు బీసీసీఐ అభినందనలు.
ఈ సీజన్‌లో సొంతగడ్డపై అజేయంగా కొనసాగుతోంది. ఇందుకు ప్రోత్సాహకంగా నజరానా అందజేస్తాం’ అని బోర్డు ఒక ప్రకటన విడుదల చేసింది. నజరానాను ప్రొ రాటా పద్ధతిలో ఇస్తామని అందులో పేర్కొన్నారు. అంటే ఆడిన మ్యాచ్‌లను బట్టి ఈ పారితోషికాన్ని అందజేయనున్నారు. పూర్తిగా నాలుగు మ్యాచ్‌లు ఆడిన ఆటగాడికి రూ. 50 లక్షలు, రెండే మ్యాచ్‌లు ఆడితే రూ. 25 లక్షలు ఇస్తారు.