'నా పంచ్ పవర్ రుచి చూపిస్తాను' | Indian boxer Vijender Singh confident ahead of professional bout | Sakshi
Sakshi News home page

'నా పంచ్ పవర్ రుచి చూపిస్తాను'

Mar 11 2016 7:10 PM | Updated on Sep 3 2017 7:30 PM

'నా పంచ్ పవర్ రుచి చూపిస్తాను'

'నా పంచ్ పవర్ రుచి చూపిస్తాను'

తన తర్వాతి గేమ్ లో ప్రత్యర్థికి పంచ్ పవర్ రుచి చూపిస్తానని భారత బాక్సర్ విజేందర్ సింగ్ వ్యాఖ్యానించాడు.

న్యూఢిల్లీ: తన తర్వాతి గేమ్ లో ప్రత్యర్థికి పంచ్ పవర్ రుచి చూపిస్తానని భారత బాక్సర్ విజేందర్ సింగ్ వ్యాఖ్యానించాడు. రెగ్యులర్ బాక్సింగ్ నుంచి ప్రొఫెషనల్ బాక్సింగ్ లోకి అడుగుపెట్టినప్పటి నుంచి ఓటమనేది లేకుండా ముందుకు సాగుతున్నాడు ఈ భారత బాక్సర్. లివర్ పూల్ లో శనివారం హంగేరికి చెందిన బాక్సర్ అలెగ్జాండర్ హోవర్త్ తో విజేందర్ తలపడనున్నాడు. ఈ సందర్భంగా మీడియా బాక్సర్ తో కాసేపు ముచ్చటించింది. గేమ్ సన్నాహకాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంది.

'నా ప్రతిభను చూపించాల్సిన సమయం. రేపటి మ్యాచ్ కు ఎంతగానో కృషి చేశాను. నేను చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను. బౌట్ లో ప్రత్యర్థికి తన పంచ్ పవర్ రుచి చూపిస్తాను' అని విజేందర్ పేర్కొన్నాడు. అమెచ్యూర్ బాక్సింగ్ కెరీర్ అద్భుతంగా సాగుతుందని, 75 కేజీల విభాగంలో ఇప్పటికే మూడు బౌట్స్ గెలిచిన విషయాన్ని హర్యానా బాక్సర్ గుర్తుచేశాడు. గత బౌట్ లో ఇంగ్లండ్ బాక్సర్ సోని వైటింగ్ ను మూడో రౌండ్ లో ఓడించాడు. ప్రత్యర్థి ఐదు బౌట్స్ గెలిచాడని, మీపై ఒత్తిడి లేదా అని మీడియా ప్రశ్నించింది. ప్రొఫెషనల్ బాక్సింగ్ లో తాను అంతగా సీనియర్ బాక్సర్ కాదని, అయినా మెరుగైన ప్రదర్శన చేయడానికి ప్రయత్నిస్తానన్నాడు. భారత్ లో తన విజయం కోసం ప్రార్థించే అభిమానుల కోసమైనా ఈ బౌట్ గెలుస్తానని చెప్పాడు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement