బంగ్లాదేశ్లో భారత్ బుకీ నిర్బంధం | 'Indian bookie' held in Bangladesh | Sakshi
Sakshi News home page

బంగ్లాదేశ్లో భారత్ బుకీ నిర్బంధం

Apr 4 2014 4:39 PM | Updated on Sep 2 2017 5:35 AM

భారత్కు చెందిన ఓ క్రికెట్ బుకీనీ గా బంగ్లాదేశ్లో నిర్భందించారు. బెనపోల్లో అతాను దత్తా అనే అనుమానితుడిని బంగ్లా ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

ఢాకా: భారత్కు చెందిన ఓ క్రికెట్ బుకీనీ గా బంగ్లాదేశ్లో నిర్భందించారు. బెనపోల్లో అతాను దత్తా అనే అనుమానితుడిని బంగ్లా ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దేశం విడిచి పోకుండా అతనిపై ఆజ్ఞలు జారీ చేశారు. బంగ్లాలో జరుగుతున్న టీ-20 ప్రపంచ కప్లో దత్తా పందేలు కాసేందుకు వచ్చాడని అనుమానిస్తున్నట్టు అత్యున్నత పోలీస్ అధికారి ఒకరు చెప్పారు. అక్రమ రవాణలో కూడా దత్తా పాత్ర ఉండొచ్చని చెప్పారు. పశ్చిమబెంగాల్కు చెందిన దత్తా మార్చి 15న బంగ్లాదేశ్ వెళ్లాడు. మార్చి 31తో వీసా గడువు ముగిసినా అతను అక్రమంగా బంగ్లాలో ఉంటున్నాడు. దీంతో దత్తాపై మూడు రోజుల క్రితం ఇమ్మిగ్రేషన్ అధికారులు రెడ్ అలెర్ట్ జారీ చేసి అతనిపై నిఘా ఉంచారు.

Advertisement
 
Advertisement
Advertisement