
సిడ్నీ : ఆస్ట్రేలియాతో జరిగిన చివరి టీ20లో భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు టీ20ల సిరీస్ 1-1తో సమమైంది. టాస్ నెగ్గి బ్యాటింగ్ దిగిన ఆసీస్.. టీమిండియా ఆల్‌రౌండర్ కృనాల్ దెబ్బకు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 164 పరుగులే చేసింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన భారత్.. కెప్టెన్ విరాట్ కోహ్లి (61: 41 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు, నాటౌట్) అద్భుత హాఫ్ సెంచరీకి తోడుగా శిఖర్ ధావన్ 41( 22 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), రోహిత్ శర్మ 23(16 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు), దినేశ్ కార్తీక్(22 నాటౌట్)లు రాణించడంతో రెండు బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో కూడా రిషభ్ పంత్ (0), కేఎల్ రాహుల్(14)లు నిరాశపరిచారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కృనాల్ పాండ్యా (4/36)కు దక్కగా.. మ్యాన్ ఆఫ్ ది సిరీస్ శిఖర్ ధావన్‌ను వరించింది.