జడేజా ఆల్‌రౌండ్ షో | India vs WICB President's XI, Highlights: R Ashwin Picks Three As Match Ends In A Draw | Sakshi
Sakshi News home page

జడేజా ఆల్‌రౌండ్ షో

Jul 17 2016 3:59 AM | Updated on Sep 4 2017 5:01 AM

జడేజా ఆల్‌రౌండ్ షో

జడేజా ఆల్‌రౌండ్ షో

బౌలింగ్‌లో మూడు వికెట్లతో చెలరేగిన రవీంద్ర జడేజా బ్యాటింగ్‌లోనూ అదరగొట్టాడు. తొమ్మిదో నంబర్ బ్యాట్స్‌మన్‌గా...

* తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 364  
* విండీస్ ఎలెవన్ రెండో ఇన్నింగ్స్‌లో 104/3

సెయింట్ కిట్స్: బౌలింగ్‌లో మూడు వికెట్లతో చెలరేగిన రవీంద్ర జడేజా బ్యాటింగ్‌లోనూ అదరగొట్టాడు. తొమ్మిదో నంబర్ బ్యాట్స్‌మన్‌గా బరిలోకి దిగిన తను (61 బంతుల్లో 56; 8 ఫోర్లు) అర్ధ సెంచరీతో రాణించడంతో... విండీస్ బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్‌తో జరుగుతున్న మూడు రోజుల మ్యాచ్‌లో భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 105.4 ఓవర్లలో 364 పరుగులు చేసింది. దీంతో 184 పరుగుల ఆధిక్యం లభించింది. జడేజా.. వృద్ధిమాన్ సాహాతో కలిసి ఎనిమిదో వికెట్‌కు 44 పరుగులు, తొమ్మిదో వికెట్‌కు అశ్విన్ (61 బంతుల్లో 26; 4 ఫోర్లు)తో కలిసి 47 పరుగులు జోడించాడు.

కార్న్‌వాల్‌కు ఐదు వికెట్లు దక్కాయి. అనంతరం చివరి రోజు శనివారం కడపటి వార్తలు అందే సరికి రెండో ఇన్నింగ్స్‌లో విండీస్ ఎలెవన్  63 ఓవర్లలో నాలుగు వికెట్లకు 154 పరుగులు చేసింది. ఓపెనర్ కాంప్‌బెల్ (59 బంతుల్లో 31; 2 ఫోర్లు; 2 సిక్సర్లు) మెరుగ్గా ఆడాడు. అయితే 70 పరుగులకే మూడు వికెట్లు పడిన దశలో బ్లాక్‌వుడ్ (121 బంతుల్లో 35 బ్యాటింగ్; 5 ఫోర్లు), విశాల్ సింగ్ (101 బంతుల్లో 39;5 ఫోర్లు 1 సిక్స్) నాలుగో వికెట్‌కు 62 పరుగులు జత చేశారు. క్రీజ్‌లో కాంప్‌బెల్‌తో పాటు హాడ్జ్ (13 బ్యాటింగ్)ఉన్నాడు. అశ్విన్‌కు రెండు, జడేజాకు ఓ వికెట్ దక్కింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement