మోర్గాన్‌కే కెప్టెన్సీ బాధ్యతలు | India vs England: Eoin Morgan returns to captain visitors for ODI and T20 series | Sakshi
Sakshi News home page

మోర్గాన్‌కే కెప్టెన్సీ బాధ్యతలు

Dec 7 2016 1:38 AM | Updated on Sep 4 2017 10:04 PM

మోర్గాన్‌కే కెప్టెన్సీ బాధ్యతలు

మోర్గాన్‌కే కెప్టెన్సీ బాధ్యతలు

భారత్‌తో జరిగే వన్డే సిరీస్‌లో తలపడే ఇంగ్లండ్ జట్టును సెలక్టర్లు ప్రకటించారు. బంగ్లాదేశ్‌తో జరిగిన గత వన్డే సిరీస్‌కు దూరంగా ఉన్న

లండన్: భారత్‌తో జరిగే వన్డే సిరీస్‌లో తలపడే ఇంగ్లండ్ జట్టును సెలక్టర్లు ప్రకటించారు. బంగ్లాదేశ్‌తో జరిగిన గత వన్డే సిరీస్‌కు దూరంగా ఉన్న ఇయాన్ మోర్గాన్ మళ్లీ కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకోనున్నాడు. ఆ సిరీస్‌లో పాల్గొనని అలెక్స్ హేల్స్, జో రూట్ కూడా భారత్‌తో పోరుకు ఎంపికయ్యారు. పరిమిత ఓవర్ల సిరీస్‌లలో భాగంగా భారత్, ఇంగ్లండ్ మధ్య 3 వన్డేలు, 3 టి20 మ్యాచ్‌లు జరుగుతాయి. జనవరి 15న పుణేలో జరిగే తొలి వన్డేకు ముందు జనవరి 10,12 తేదీల్లో భారత్ ‘ఎ’తో ఇంగ్లండ్ ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడుతుంది. మరోవైపు టెస్టుల కోసం స్పిన్ కన్సల్టెంట్‌గా పని చేస్తున్న సక్లాయిన్ ముస్తాక్ కాంట్రాక్ట్‌ను ఇంగ్లండ్ బోర్డు పొడిగించింది. అతను వన్డే సిరీస్ వరకు కూడా జట్టుతో కొనసాగుతాడు. 
 
 ఇంగ్లండ్ జట్టు: మోర్గాన్ (కెప్టెన్), మొయిన్ అలీ, జేక్ బాల్, బిల్లింగ్‌‌స, బట్లర్, డాసన్, హేల్స్, ప్లంకెట్, రషీద్, రూట్, జేసన్ రాయ్, స్టోక్స్, విల్లీ (వన్డేలు, టి20లకు), బెయిర్‌స్టో, వోక్స్ (వన్డేలకు మాత్రమే), జోర్డాన్, టైమల్ మిల్స్ (టి20లకు మాత్రమే).   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement