‘పాక్‌తో ఆడకున్నా ఇబ్బందేం రాదు’ | India should not play Pakistan in 2019 Cricket World Cup, Harbhajan | Sakshi
Sakshi News home page

‘వరల్డ్‌కప్‌లో పాక్‌తో ఆడకున్నా ఇబ్బందేం రాదు’

Feb 19 2019 10:11 AM | Updated on May 30 2019 4:50 PM

India should not play Pakistan in 2019 Cricket World Cup, Harbhajan - Sakshi

న్యూఢిల్లీ: సీఆర్పీఎఫ్‌ జవాన్లపై పుల్వామా ఉగ్ర దాడి ఘటన నేపథ్యంలో పాకిస్తాన్‌తో భారత్‌ అన్ని రకాల క్రీడా సంబంధాలను తెంచుకోవాలని భారత క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌ అన్నాడు. ఈ క్రమంలో వన్డే ప్రపంచ కప్‌లో భాగంగా జూన్‌ 16న పాకిస్తాన్‌తో జరగాల్సిన మ్యాచ్‌నూ బహిష్కరించాలని పిలుపునిచ్చాడు.

‘ఈ క్లిష్ట సమయంలో రక్షణ బలగాలకు పూర్తి అండగా నిలవాలి. వారి త్యాగాలు వృథాగా పోవడానికి వీల్లేదు. పాక్‌తో ఆడకున్నా, మన ప్రపంచ కప్‌ విజయావకాశాలకు ఇబ్బందేం రాదు. అన్నింటికంటే దేశం ముఖ్యం. మనందరం దేశం కోసం నిలబడాలి. క్రికెట్, హాకీ ఇంకేదైనా సరే పాక్‌తో ఆడాల్సిన పని లేదు’ అని హర్భజన్‌ అన్నాడు.

ఇక్కడ చదవండి: పాక్‌తో ఆడే ముచ్చటే లేదు: ఐపీఎల్‌ ఛైర్మన్‌

పాక్‌ క్రికెట్‌కు షాక్‌ మీద షాక్‌.. పీసీబీ స్పందన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement