
ఫేవరెట్ భారత్
ఈ ఏడాది జూన్‌లో ఇంగ్లండ్‌లో జరిగే మహిళల వన్డే ప్రపంచకప్ క్రికెట్ టోర్నీకి అర్హత సాధించేందుకు 10 జట్లు పోటీ పడనున్నాయి
కొలంబో: ఈ ఏడాది జూన్‌లో ఇంగ్లండ్‌లో జరిగే మహిళల వన్డే ప్రపంచకప్ క్రికెట్ టోర్నీకి అర్హత సాధించేందుకు 10 జట్లు పోటీ పడనున్నాయి. నాలుగు బెర్త్‌ల కోసం జరిగే క్వాలిఫయింగ్ టోర్నీ మంగళవారం ప్రారంభ మవుతుంది. ఈనెల 21న ముగిసే ఈ టోర్నీలో భారత్‌తోపాటు శ్రీలంక, ఐర్లాండ్, థాయ్‌లాండ్, జింబాబ్వే, పాకిస్తాన్, బంగ్లాదేశ్, స్కాట్లాండ్, దక్షిణాఫ్రికా, పాపువా న్యూగినియా జట్లు పాల్గొంటున్నాయి. టాప్-4లో నిలిచిన జట్లు ప్రపంచకప్‌కు అర్హత సాధిస్తారుు. మంగళవారం తమ తొలి మ్యాచ్‌లో శ్రీలంకతో భారత్ తలపడుతుంది. ఈ పోరులో భారత్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతుంది.