భారత్‌ ‘ఎ’ గెలుపు

India-A lads level series - Sakshi

బెంగళూరు: స్పిన్నర్లు చెలరేగడంతో ఆస్ట్రేలియా ‘ఎ’తో జరిగిన రెండో అనధికారిక టెస్టులో భారత ‘ఎ’ జట్టు ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 1–1తో ముగించింది. ఆట చివరిరోజు మంగళవారం ఓవర్‌నైట్‌ స్కోరు 38/2తో రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఆస్ట్రేలియా ‘ఎ’ 213 పరుగులకు ఆలౌటైంది.

స్పిన్నర్లు కుల్దీప్‌ యాదవ్, కృష్ణప్ప గౌతమ్‌ మూడేసి వికెట్లు పడగొట్టగా.. నదీమ్‌కు రెండు వికెట్లు దక్కాయి. 8 ఓవర్లలో 55 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ 6.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి దానిని అందుకుంది. శ్రేయస్‌ అయ్యర్‌ (3), శుబ్‌మన్‌ గిల్‌ (4), కృష్ణప్ప గౌతమ్‌ (1), భరత్‌ (12) ఔటవ్వగా... అంకిత్‌ బావ్నే (18 బంతుల్లో 28 నాటౌట్‌; 3 ఫోర్లు), సమర్థ్‌ (5 నాటౌట్‌) భారత్‌ విజయాన్ని ఖాయం చేశారు. 

సంక్షిప్త స్కోర్లు 
ఆస్ట్రేలియా ‘ఎ’ తొలి ఇన్నింగ్స్‌: 346; భారత్‌ ‘ఎ’ తొలి ఇన్నింగ్స్‌: 505; ఆస్ట్రేలియా ‘ఎ’ రెండో ఇన్నింగ్స్‌: 213 (హ్యాండ్స్‌కోంబ్‌ 56, మార్‌‡్ష 36, చహర్‌ 2/30, నదీమ్‌ 2/67, గౌతమ్‌ 3/39, కుల్దీప్‌ 3/46); భారత్‌ ‘ఎ’ రెండో ఇన్నింగ్స్‌: 55/4.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top