భారత బ్యాడ్మింటన్‌లో చరిత్రలో తొలిసారి.. | India finish the year with four shuttlers in top 10 for the first time | Sakshi
Sakshi News home page

భారత బ్యాడ్మింటన్‌లో చరిత్రలో తొలిసారి..

Dec 30 2017 3:44 PM | Updated on Dec 30 2017 4:00 PM

India finish the year with four shuttlers in top 10 for the first time - Sakshi

న్యూఢిల్లీ: గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది అత్యధిక విజయాలు, అద్వితీయ పురోగతి సాధించిన క్రీడాంశం బ్యాడ్మింటన్‌. పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్, సాయిప్రణీత్, హెచ్‌ఎస్‌ ప్రణయ్‌... మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు, సైనా నెహ్వాల్‌ ఒకరిని మించి మరొకరు తమ ప్రదర్శనతో అబ్బురపరిచారు. శ్రీకాంత్‌ ఏకంగా నాలుగు సూపర్‌ సిరీస్‌ టైటిల్స్‌ సాధించి భారత్‌ తరఫున ఒకే ఏడాది అత్యధిక సూపర్‌ సిరీస్‌ టైటిల్స్‌ నెగ్గిన తొలి ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు.

ఈ క్రమంలోనే నలుగురు భారత ఆటగాళ్లు టాప్‌-10లో స్థానం సంపాదించి కొత్త చరిత్ర లిఖించారు. ప్రస్తుత బ్మాడ్మింటన్‌ వరల్డ్‌ ఫెడరేషన్‌(బీడబ్యూఎఫ్‌) ర్యాంకింగ్స్‌ ప్రకారం పీవీ సింధు, శ్రీకాంత్‌లు మూడో ర్యాంకులో కొనసాగుతుండగా, సైనా నెహ్వాల్‌, హెచ్‌ఎస్‌ ప్రణయ్‌లు 10 స్థానంలో నిలిచారు. ఇలా నలుగురు భారత ప్లేయర్లు టాప్‌-10లో నిలవడం మన బ్యాడ్మింటన్‌ చరిత్రలో ఇదే తొలిసారి. ఇక టాప్‌ -20లో సాయి ప‍్రణీత్‌కు చోటు దక్కింది. ప్రస్తుతం సాయి ప్రణీత్‌ 16వ ర్యాంకులో కొనసాగుతున్నాడు. దాంతో  2017లో భారత బ్యాడ్మింటన్‌కు ఘనమైన ముగింపు లభించినట్లయ్యింది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement