విజయ్ 122, ధోని 50, భారత్ 259/4 | India 259/4, Murali Vijay Century | Sakshi
Sakshi News home page

విజయ్ 122, ధోని 50, భారత్ 259/4

Jul 9 2014 11:54 PM | Updated on Sep 2 2017 10:03 AM

విజయ్ 122, ధోని 50, భారత్ 259/4

విజయ్ 122, ధోని 50, భారత్ 259/4

పటౌడీ ట్రోఫిలో భాగంగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న తొలి టెస్ట్ లో మురళీ విజయ్ రాణించడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు 4 వికెట్లు కోల్పోయి 259 పరుగులు చేసింది.

నాటింగహమ్: పటౌడీ ట్రోఫిలో భాగంగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న తొలి టెస్ట్ లో మురళీ విజయ్ రాణించడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు 4 వికెట్లు కోల్పోయి 259 పరుగులు చేసింది.  సెంచరీతో ఆకట్టుకున్న భారత ఓపెనర్ మురళీ విజయ్ 122 పరుగులతో, కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని 50 పరుగులతో క్రీజులో ఉన్నారు. 
 
భారత జట్టు లో ధావన్ 12, పుజారా 38, కోహ్లీ 1, రహానే 32 పరుగులు చేసి అవుటయ్యారు. ఇంగ్లాండ్ బౌలర్లలో అండర్సన్ కు 2 వికెట్లు, బ్రాడ్, ప్లంకెట్ కు చెరో వికెట్ దక్కింది.  నాటింగహమ్, ట్రెంట్ బ్రిడ్జ్ లో జరుగుతున్న తొలి టెస్ట్ లో భారత జట్టు టాస్ గెలిచి బ్యాంటింగ్ ఎంచుకుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement