Pataudi Trophy
-
‘పటౌడీ ట్రోఫీ’కి మంగళం!
లండన్: ఇంగ్లండ్ గడ్డపై భారత్–ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగే ద్వైపాక్షిక టెస్టు సిరీస్‌ను 2007 నుంచి మన్సూర్ అలీఖాన్ (ఎంఏకే) పటౌడీ ట్రోఫీ పేరిట నిర్వహించడం జరుగుతోంది. అయితే ‘పటౌడీ ట్రోఫీ’కి గుడ్‌బై చెప్పాలని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) భావిస్తోంది. ఈ ఏడాది జూన్‌లో ఇంగ్లండ్‌లో భారత్ పర్యటన నుంచి దీనిని అమలు చేయాలనే ఆలోచనలో ఈసీబీ ఉందని సమాచారం. ‘పటౌడీ ట్రోఫీ’కి మంగళం పాడేందుకు కచ్చితమైన కారణాన్ని ఈసీబీ ఇంకా వెల్లడించకపోయినా... ‘పటౌడీ’ పేరు బదులుగా రెండు దేశాల నుంచి ఇద్దరు దిగ్గజాల పేరుతో సరికొత్త ట్రోఫీ తెరపైకి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ‘పటౌడీ ట్రోఫీ’కి ముగింపు పలికే విషయంపై ఈసీబీ అధికారులు ఎలాంటి వ్యాఖ్యలు చేయడంలేదు. ‘పటౌడీ ట్రోఫీ’ మార్పు ఉండదని చెప్పడంలేదు. ఎంఏకే పటౌడీ 1961 నుంచి 1975 మధ్యకాలంలో భారత జట్టు తరఫున 46 టెస్టులు ఆడారు. ‘పటౌడీ ట్రోఫీ’కి వీడ్కోలు పలుకుతున్నామనే విషయాన్ని పటౌడీ కుటుంబసభ్యులకు ఇప్పటికే ఈసీబీ సమాచారం ఇచ్చిందని తెలిసింది. ‘కొంతకాలం తర్వాత ఆయా వ్యక్తుల పేర్లతో నిర్వహించే ట్రోఫీలకు ముగింపు పలకడం సహజం’ అని పటౌడీ కుటుంటానికి సన్నిహితులు వ్యాఖ్యానించడం గమనార్హం. క్రికెట్లో ‘ట్రోఫీ’లు రిటైర్ కావడం సహజమే. గతంలో ఇంగ్లండ్–వెస్టిండీస్ జట్ల మధ్య ‘విజ్డెన్ ట్రోఫీ’తో సిరీస్‌లు జరిగాయి. ఆ తర్వాత కొన్నాళ్లకు ‘విజ్డెన్ ట్రోఫీ’కి రిటైర్మెంట్ ఇచ్చేసి దాని బదులుగా రెండు జట్ల మధ్య ‘రిచర్డ్స్–బోథమ్ ట్రోఫీ’తో సిరీస్‌లు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆయా దేశాల మధ్య నాలుగు ట్రోఫీల టెస్టు సిరీస్‌లు నిర్వహిస్తున్నారు. భారత్–ఆ్రస్టేలియా జట్ల మధ్య 1996 నుంచి ‘బోర్డర్–గావాస్కర్ ట్రోఫీ’... వెస్టిండీస్–ఆస్ట్రేలియా జట్ల మధ్య 1960 నుంచి ‘ఫ్రాంక్ వోరెల్ ట్రోఫీ’... ఆ్రస్టేలియా–శ్రీలంక జట్ల మధ్య 2007 నుంచి ‘వార్న్–మురళీథరన్ ట్రోఫీ’... న్యూజిలాండ్–ఇంగ్లండ్ జట్ల మధ్య 2024 నుంచి ‘క్రో–థోర్ప్ ట్రోఫీ’లను నిర్వహిస్తున్నారు. ఇంగ్లండ్ పర్యటన సమయంలో భారత్–ఇంగ్లండ్ జట్ల మధ్య టెస్టు సిరీస్ 2007 నుంచి ‘పటౌడీ ట్రోఫీ’తో జరుగుతోంది. భారత్ వేదికగా ఈ రెండు జట్ల మధ్య టెస్టు సిరీస్‌ను 1951 నుంచి బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ‘ఆంథోనీ డి మెల్లో ట్రోఫీ’ పేరుతో నిర్వహిస్తున్నారు. -
డ్రా చేసుకున్నా చాలు.. సిరీస్ మనదే
భారత జట్టు ఇంగ్లండ్ గడ్డపై 2007లో టెస్టు సిరీస్ గెలిచింది. ఆ తర్వాత ఆడిన మూడు సిరీస్‌లలో 0–4, 1–3, 1–4తో ఓటమిపాలైంది. ఇప్పుడు మళ్లీ ఇంగ్లండ్‌ను చిత్తు చేసి పటౌడీ ట్రోఫీని సొంతం చేసుకునే అవకాశం టీమిండియా ముంగిట నిలిచింది. కోహ్లి సేన కనీసం మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకోగలిగినా చాలు. ఇంగ్లండ్ మాత్రం స్వదేశంలో సిరీస్ కోల్పోకుండా ఉండాలనే తప్పనిసరిగా మ్యాచ్ గెలవాల్సిన స్థితిలో ఉంది. మాంచెస్టర్: భారత క్రికెట్ జట్టు ఈ టూర్ కోసం ఇంగ్లండ్‌లో అడుగు పెట్టి నేటితో సరిగ్గా వంద రోజులు! ఈ ‘సెంచరీ’లో డబ్ల్యూటీసీ ఫైనల్లో కివీస్ చేతిలో ఓటమి, ఇంగ్లండ్‌పై రెండు అద్భుత విజయాలు, ఒక పరాజయం ఉన్నాయి. తమ పర్యటనను చిరస్మరణీయం చేసుకునే క్రమంలో టీమిండియా ఇప్పుడు చివరి ఘట్టాన నిలిచింది. ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఓల్డ్ ట్రఫోర్డ్ మైదానంలో నేటినుంచి జరిగే చివరి పోరులో భారత్ తలపడనుంది. విహారికి అవకాశం ఉందా! కెపె్టన్ కోహ్లి లెక్క ప్రకారం చూస్తే గత మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టులో ఎలాంటి మార్పూ అవసరం లేదు. రోహిత్, పుజారా, జడేజా స్వల్ప గాయాలతో కొంత ఇబ్బంది పడినట్లు కనిపించినా...మ్యాచ్ సమయానికి వారంతా సిద్ధమవడం ఖాయం. ఇంగ్లండ్‌ను రెండు సార్లు ఆలౌట్ చేసేందుకు మరోసారి నాలుగు పేసర్ల వ్యూహాన్నే కోహ్లి కోరుకుంటే అశి్వన్ ఈ మ్యాచ్‌లోనూ పెవిలియన్‌కు పరిమితం కాక తప్పదు. బుమ్రాకు విశ్రాంతినివ్వాలని భావిస్తే అశి్వన్‌ను చోటు కలి్పంచవచ్చని చర్చ జరుగుతున్నా...ఇంకా సిరీస్ గెలవలేదు కాబట్టి మేనేజ్మెంట్ అలాంటి సాహసం చేయకపోవచ్చు. అయితే ఒకే ఒక స్థానం విషయంలో మాత్రం కొంత అనిశ్చితి ఉంది. సిరీస్ మొత్తం ఏడు ఇన్నింగ్స్‌లలో కలిపి 109 పరుగులే చేసిన రహానేకు మరో అవకాశం ఇస్తారా అనేదే చూడాలి. మానసికంగా కూడా ఇబ్బంది పడుతున్న రహానేను తప్పించాలని అనుకుంటే ఆరో స్థానంలో విహారి సరైన వ్యక్తి కాగలడు. జట్టు మొత్తం ఓవల్ తరహాలో తమ అత్యుత్తమ ప్రదర్శన కనబరిస్తే టీమిండియాను నిలువరించడం ఇంగ్లండ్‌కు చాలా కష్టమవుతుంది. రూట్ మినహా... గత కొన్నేళ్లలో ఇంగ్లండ్ జట్టు ఇలాంటి ఇబ్బందికర పరిస్థితిలో ఎప్పుడూ లేదు. భారత్‌తో సిరీస్‌కు ముందు స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో ఓడిన రూట్ సేన వరుసగా రెండో సిరీస్ ఓడిపోయే ప్రమాదంలో నిలిచింది. సొంతగడ్డపై కూడా ఆ జట్టు బ్యాట్స్‌మెన్ పేలవంగా ఆడుతుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. తొలి మూడు టెస్టుల్లో సెంచరీలు చేసిన కెపె్టన్ రూట్ గత మ్యాచ్‌లోనూ జట్టును రక్షించేందుకు తీవ్ర ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. అతను తప్ప మరో బ్యాట్స్‌మన్‌ను నమ్మలేని పరిస్థితిలో ఇంగ్లండ్ ఉంది. కీపర్‌గా బట్లర్ మళ్లీ టీమ్‌లోకి వచి్చనా తొలి మూడు టెస్టుల్లోనూ అతను రాణించింది లేదు. అయితే ఆ జట్టుకు పెద్దగా ప్రత్యామ్నాయాలు కూడా అందుబాటులో లేవు. ఓవల్‌లో పోప్ రాణించడంతో ఈ మ్యాచ్‌లో బెయిర్‌స్టోపై వేటు ఖాయమైంది. సీనియర్ స్టార్ అండర్సన్‌కు విశ్రాంతి ఇవ్వాలనే ఆలోచన ఉన్నా...సొంత మైదానంలో జిమ్మీ అందుకు ఇష్టపడకపోవచ్చు. మొత్తంగా ఇంగ్లండ్ మ్యాచ్ నెగ్గాలంటే బ్యాట్స్‌మెన్ తమ శక్తికి మించిన ప్రదర్శన చేయాల్సి ఉంది. అసిస్టెంట్ ఫిజియోకు కరోనా సిరీస్ ఫలితాన్ని తేల్చే చివరి టెస్టు కోసం ఇరు జట్లు సన్నద్ధంగా ఉన్నా మ్యాచ్ జరిగే విషయంలో కొంత ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాజా పరీక్షల్లో టీమిండియా అసిస్టెంట్ ఫిజియో యోగేశ్ పర్మార్ కరోనా ‘పాజిటివ్’గా తేలడమే అం దుకు కారణం. గత నాలుగు రోజులుగా యోగేశ్... గాయాలతో ఇబ్బంది పడుతున్న జట్టు సభ్యులు రోహిత్, పుజారా, షమీ, జడేజాలకు ఫిజియోగా తన సేవలు అందించాడు. ప్రధాన ఫిజియో నితిన్ పటేల్ ఇప్పటికే ఐసోలేషన్‌లో ఉండటంతో పర్మార్ ఎక్కువ సమయం టీమిండియా ఆటగాళ్లతో గడపాల్సి వచి్చంది. మ్యాచ్ ముందు రోజు టీమ్ ప్రాక్టీస్ కూడా రద్దయింది. గురువారం రాత్రి వచి్చన నివేదికల్లో జట్టు సభ్యులంతా ‘నెగెటివ్’గా తేలారు. అయితే సహజంగానే కోవిడ్ లక్షణాలు కొంత ఆలస్యంగా కనిపించే అవకాశం ఉండటంతో మ్యాచ్‌కు ఏమైనా అంతరాయం కలుగుతుందేమో అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒక వేళ అనూహ్యంగా మ్యాచ్ జరిగే అవకాశం లేకపోతే సిరీస్‌లో విజేతను ప్రకటించకుండా అసంపూర్తిగా ముగించి తర్వాతి రోజుల్లో విడిగా ఈ ఒక్క టెస్టును నిర్వహించేందుకు అవకాశం ఉంది. -
లంచ్ సమయానికి ఇంగ్లాండ్ 358/3
సాతాంప్టన్: పటౌడీ కప్ లో భాగంగా సౌతాంప్టన్ లో భారత్ తో జరుగుతున్న రెండవ రోజు ఆటలో ఇంగ్లాండ్ జట్టు మూడు వికెట్లు కోల్పోయి 358 పరుగులు చేసింది. లంచ్ సమయానికి ఇయాన్ బెల్ 68, రూట్ 2 పరుగులతో నాటౌట్ క్రీజులో ఉన్నారు. కుక్ 95, రాబ్సన్ 26, బాలెన్స్ 156 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. భారత బౌలర్లలో షమీ, శర్మ, జడేజాలకు చెరో వికెట్ లభించింది. -
విజయ్ 122, ధోని 50, భారత్ 259/4
నాటింగహమ్: పటౌడీ ట్రోఫిలో భాగంగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న తొలి టెస్ట్ లో మురళీ విజయ్ రాణించడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు 4 వికెట్లు కోల్పోయి 259 పరుగులు చేసింది. సెంచరీతో ఆకట్టుకున్న భారత ఓపెనర్ మురళీ విజయ్ 122 పరుగులతో, కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని 50 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత జట్టు లో ధావన్ 12, పుజారా 38, కోహ్లీ 1, రహానే 32 పరుగులు చేసి అవుటయ్యారు. ఇంగ్లాండ్ బౌలర్లలో అండర్సన్ కు 2 వికెట్లు, బ్రాడ్, ప్లంకెట్ కు చెరో వికెట్ దక్కింది. నాటింగహమ్, ట్రెంట్ బ్రిడ్జ్ లో జరుగుతున్న తొలి టెస్ట్ లో భారత జట్టు టాస్ గెలిచి బ్యాంటింగ్ ఎంచుకుంది. -
మురళీ విజయ్ సెంచరీ, భారత్ 211/4
నాటింగహమ్: పటౌడీ ట్రోఫిలో భాగంగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న తొలి టెస్ట్ లో మురళీ విజయ్ రాణించడంతో భారత జట్టు 4 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. భారత ఓపెనర్ మురళీ విజయ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. డ్రింక్స్ సమయానికి మురళీ విజయ్ 102, ధోని 23 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత జట్టు లో ధావన్ 12, పుజారా 38, కోహ్లీ 1, రహానే 32 పరుగులు చేసి అవుటయ్యారు. ఇంగ్లాండ్ బౌలర్లలో అండర్సన్ కు 2 వికెట్లు, బ్రాడ్, ప్లంకెట్ కు చెరో వికెట్ దక్కింది. నాటింగహమ్, ట్రెంట్ బ్రిడ్జ్ లో జరుగుతున్న తొలి టెస్ట్ లో భారత జట్టు టాస్ గెలిచి బ్యాంటింగ్ ఎంచుకుంది.