టేలర్‌ 44.. విలియమ్సన్‌ 89 | IND Vs NZ: Williamson Falls Short Of Century | Sakshi
Sakshi News home page

టేలర్‌ 44.. విలియమ్సన్‌ 89

Feb 22 2020 11:19 AM | Updated on Feb 22 2020 11:23 AM

IND Vs NZ: Williamson Falls Short Of Century - Sakshi

వెల్లింగ్టన్‌: టీమిండియాతో ఇక్కడ జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో కేన్‌ విలియమ్సన్‌ నాల్గో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. విలియమ్సన్‌ 89 పరుగుల వద్ద ఔట్‌ కావడంతో 11 పరుగుల దూరంలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌లో మహ్మద్‌ షమీ వేసిన 63 ఓవర్‌ నాల్గో బంతిని కవర్స్‌మీదుగా షాట్‌ ఆడటానికి విలియమ్సన్‌ యత్నించగా అక్కడే ఫీల్డింగ్‌ చేస్తున్న రవీంద్ర జడేజా(సబ్‌స్టిట్యూట్‌ ఫీల్డర్‌) అద్భుతంగా క్యాచ్‌ అందుకున్నాడు. బంతి గ్రౌండ్‌ను తాకే క్రమంలో జడేజా క్యాచ్‌ అందుకోవడంతో విలియమ్సన్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. దాంతో 185 పరుగుల వద్ద కివీస్‌ నాల్గో వికెట్‌ను నష్టపోయింది.(ఇక్కడ చదవండి: రహానే కోసం పంత్‌ వికెట్‌ త్యాగం..)

అంతకుముందు వందో టెస్టు మ్యాచ్‌ ఆడుతున్న న్యూజిలాండ్‌ వెటరన్‌ ఆటగాడు రాస్‌ టేలర్‌(44) మూడో వికెట్‌గా ఔటయ్యాడు. ఇషాంత్‌ శర్మ వేసిన 53 ఓవర్‌ తొలి బంతికి పుజారాకు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. ఎక్స్‌ట్రా బౌన్స్‌తో వేసిన బంతికి తడబడిన టేలర్‌.. ఎటు ఆడాలో తెలియక లెగ్‌ సైడ్‌ ఫ్లిక్‌ చేశాడు. అది కాస్తా గ్లౌవ్స్‌ తాకి స్వ్కేర్‌ లెగ్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న పుజారా చేతిలో పడింది. ఇది చాలా సింపుల్‌ క్యాచ్‌తో టేలర్‌ ఔట్‌ కావడంతో టీమిండియా ఊపిరి పీల్చుకుంది. మూడో వికెట్‌కు టేలర్‌-విలియమ్సన్‌లు 93 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించారు. న్యూజిలాండ్‌ కోల్పోయిన తొలి నాలుగు వికెట్లలో ఇషాంత్‌ మూడు వికెట్లు సాధించగా, షమీ వికెట్‌  తీశాడు.

తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 165 పరుగులకే ఆలౌటైంది. ఓవరనైట్‌ స్కోర్‌ 122/5తో రెండో రోజు ఇన్నింగ్‌ ఆరంభించిన కోహ్లి సేన మరో 43 పరుగులు జోడించి మిగతా ఐదు వికెట్లను కోల్పోయింది. పట్టుమని 15 ఓవర్లు కూడా టీమిండియాను బ్యాటింగ్‌ చేయనీయలేదు కివీస్‌ బౌలర్లు. ఆదుకుంటారని అనుకున్న వైస్‌ కెప్టెన్‌ అజింక్యా రహానే (138 బంతుల్లో 46; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించగా, రిషభ్‌ పంత్‌ (19)లు తీవ్రంగా నిరాశపరిచాడు. (ఇక్కడ చదవండి: దక్షిణాఫ్రికా అతి పెద్ద పరాజయం)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement