శివం దూబే చెత్త రికార్డు

IND Vs NZ: Dube Bowls Most Expensive Over For India In T20Is - Sakshi

మౌంట్‌మాంగనీ: అటు బ్యాటింగ్‌లోనే కాదు.. ఇటు బౌలింగ్‌లోనూ ఆకట్టుకోలేకపోతున్నాడు టీమిండియా యువ ఆల్‌ రౌండర్‌ శివం దూబే. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో ఇప్పటివరకూ బ్యాట్‌తో అలరించని దూబే.. బౌలింగ్‌లో కూడా భారీగానే పరుగులు ఇచ్చుకుంటున్నాడు. కాగా, కివీస్‌తో చివరిదైన ఐదో టీ20లో చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులిచ్చిన చెత్త గణాంకాలను నమోదు చేశాడు. ఇప్పటివరకూ ఆ రికార్డు స్టువర్ట్‌ బిన్నీ(32 పరుగులు) పేరిట ఉండగా దాన్ని తన పేరిట లిఖించుకున్నాడు. కివీస్‌తో ఆఖరి టీ20లో 10 ఓవర్‌ వేసిన దూబే 34 పరుగులిచ్చి చెత్త రికార్డును సాధించాడు. ఆ ఓవర్‌లో సీఫెర్ట్‌-రాస్‌ టేలర్‌లు చెలరేగిపోయారు. నాలుగు సిక్స్‌లు,. రెండు ఫోర్లతో బ్యాట్‌ ఝుళిపించారు. ఇందులో సీఫెర్ట్‌ రెండు సిక్స్‌లు ఫోర్‌ కొట్టగా, టేలర్‌ కూడా రెండు సిక్స్‌లు ఫోర్‌ కొట్టాడు. అందులో ఒకటి నో బాల్‌ కాగా, మరొక బంతికి సింగిల్‌ వచ్చింది.(ఇక్కడ చదవండి: శాంసన్‌.. మైండ్‌ బ్లోయింగ్‌ ఫీల్డింగ్‌!)

10 ఓవర్‌ తొలి రెండు బంతుల్ని సీఫెర్ట్‌ సిక్స్‌లుగా మలచగా, మూడో బంతికి ఫోర్‌, నాల్గో బంతికి సింగిల్‌ తీశాడు. ఇక ఐదో బంతి నో బాల్‌ కాగా, దానికి ఫోర్‌ వచ్చింది. దాంతో ఎక్స్‌ట్రా పరుగు, బంతి కూడా వచ్చింది. దాంతో ఫ్రీ హిట్‌ను సిక్స్‌ కొట్టిన టేలర్‌.. ఆఖరి బంతికి కూడా సిక్స్‌ తో ముగింపు ఇచ్చాడు. టీమిండియా 164 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌ జట్టులో కేఎల్‌ రాహుల్‌(45; 33 బంతుల్లో 4 ఫోర్లు, 2సిక్స్‌లు), రోహిత్‌ శర్మ(60 రిటైర్డ్‌ హర్ట్‌; 41 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) ధాటిగా ఆడటంతో పాటు శ్రేయస్‌ అయ్యర్‌(33 నాటౌట్‌; 1 ఫోర్‌, 2 సిక్స్‌లు) మరోసారి బాధ్యతాయుతంగా ఆడటంతో నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో కివీస్‌ ఆదిలోనే మూడు వికెట్లు కోల్పోయింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top