ఓక్రిడ్జ్ శుభారంభం | In foot ball tournment Oakridge school started | Sakshi
Sakshi News home page

ఓక్రిడ్జ్ శుభారంభం

Sep 27 2013 12:03 AM | Updated on Oct 2 2018 8:39 PM

అంతర్ పాఠశాలల సెవన్ ఏ సైడ్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో ఓక్రిడ్జ్ అంతర్జాతీయ పాఠశాల శుభారంభం చేసింది. ఖాజాగూడలోని ఓక్రిడ్జ్ అంతర్జాతీయ పాఠశాలలో గురువారం ప్రారంభమైన ఈ టోర్నీలో జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ జట్టును 4-2 స్కోరుతో ఓడించింది.

రాయదుర్గం, న్యూస్‌లైన్: అంతర్ పాఠశాలల సెవన్ ఏ సైడ్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో ఓక్రిడ్జ్ అంతర్జాతీయ పాఠశాల శుభారంభం చేసింది. ఖాజాగూడలోని ఓక్రిడ్జ్ అంతర్జాతీయ పాఠశాలలో గురువారం ప్రారంభమైన ఈ టోర్నీలో జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ జట్టును 4-2 స్కోరుతో ఓడించింది. కెన్నడీ గ్లోబల్‌స్కూల్ జట్టు 5-1 స్కోరుతో ఆగాఖాన్ అకాడమీ జట్టును ఓడించింది. శనివారం ఫైనల్ పోటీలను నిర్వహిస్తారు.
 
 నగరంలోని 14 పాఠశాలలకు చెందిన ఫుట్‌బాల్ జట్లు ఈ పోటీల్లో పాల్గొంటున్నాయి. ఈ పోటీలను మాజీ జాతీయ ఫుట్‌బాల్ క్రీడాకారుడు మహ్మద్ హబీబ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల వైస్ ప్రిన్సిపల్ బిజుబేబి, పీపుల్స్ కంబైన్ ప్రతినిధి రాజన్, పాఠశాల స్పోర్ట్స్ కోఆర్డినేటర్ మార్టిన్, కోచ్‌లు, వివిధ జట్ల క్రీడాకారులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement