టాప్’ కోసం బరిలోకి | In champions league four teams are trying to be in Top position | Sakshi
Sakshi News home page

టాప్’ కోసం బరిలోకి

Sep 20 2013 1:03 AM | Updated on Sep 1 2017 10:51 PM

చాంపియన్స్ లీగ్ టి20లో ప్రధాన గ్రూప్‌లో చోటు కోసం జరుగుతున్న క్వాలిఫయింగ్ పోరులో ఇప్పటికే స్పష్టత వచ్చేసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్, ఒటాగో వోల్ట్స్ (కివీస్) జట్లు తమ ప్రత్యర్థులపై వరుసగా రెండు విజయాలు సాధించి అర్హత సాధించాయి.

చాంపియన్స్ లీగ్‌లో నేడు
  కందురతా మారూన్స్   x OòœçÜ-Ìê-»ê§Šl ÐøÌŒæ-ÓSÞ
 సాయంత్రం 4 గంటల నుంచి
 సన్‌రైజర్స్    x JsêVø ÐøÌŒætÞ
 రాత్రి 8 గంటల నుంచి
 స్టార్ క్రికెట్, స్టార్ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం
 
 మొహాలీ: చాంపియన్స్ లీగ్ టి20లో ప్రధాన గ్రూప్‌లో చోటు కోసం జరుగుతున్న క్వాలిఫయింగ్ పోరులో ఇప్పటికే స్పష్టత వచ్చేసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్, ఒటాగో వోల్ట్స్ (కివీస్) జట్లు తమ ప్రత్యర్థులపై వరుసగా రెండు విజయాలు సాధించి అర్హత సాధించాయి. ఈ నేపథ్యంలో స్థానిక పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ మైదానంలో శనివారం కందురతా మారూన్స్, ఫైసలాబాద్ వోల్వ్స్ ... సన్‌రైజర్స్, వోల్ట్స్ మధ్య జరిగే మ్యాచ్ లు నామమాత్రంగా మారాయి. కానీ సన్‌రైజర్స్, వోల్ట్స్ మాత్రం ఎలాంటి అలక్ష్యం చూపకుండా తమ దూకుడును కొనసాగించి పట్టికలో అగ్రస్థానం దక్కించుకోవాలని చూస్తున్నాయి.
 
 ఈ మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండానే రెండు జట్లు ఏ గ్రూప్‌లో ఆడేది నిర్ణయించారు. సన్‌రైజర్స్ జట్టు గ్రూప్ ‘బి’లో చెన్నై, ట్రినిడాడ్, బ్రిస్బేన్, టైటాన్‌లతో తలపడుతుంది. వోల్ట్స్ జట్టు గ్రూప్ ‘ఎ’లో రాజస్థాన్, ముంబై, లయన్స్, పెర్త్‌లతో అమీతుమీ తేల్చుకుంటుంది. మరోవైపు కందురతా, ఫైసలాబాద్ వోల్స్వ్ జట్లు తమ చివరి మ్యాచ్‌లోనైనా నెగ్గి పట్టికలో చివరి స్థానంలో నిలవకుండా చూడాలని అనుకుంటున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement