పేస్‌ జంటకు టైటిల్‌ | Ilkley Trophy: Leander Paes wins doubles event with Canadian | Sakshi
Sakshi News home page

పేస్‌ జంటకు టైటిల్‌

Jun 25 2017 12:46 AM | Updated on Sep 5 2017 2:22 PM

పేస్‌ జంటకు టైటిల్‌

పేస్‌ జంటకు టైటిల్‌

భారత టెన్నిస్‌ దిగ్గజం లియాండర్‌ పేస్‌ ఈ ఏడాది మూడో డబుల్స్‌ టైటిల్‌ను సాధించాడు.

ఇల్‌క్లే (బ్రిటన్‌): భారత టెన్నిస్‌ దిగ్గజం లియాండర్‌ పేస్‌ ఈ ఏడాది మూడో డబుల్స్‌ టైటిల్‌ను సాధించాడు. శనివారం ముగిసిన ఎగాన్‌ ఏటీపీ చాలెంజర్‌ టోర్నమెంట్‌లో తన భాగస్వామి ఆదిల్‌ షమస్దీన్‌ (కెనడా)తో కలిసి పేస్‌ విజేతగా నిలిచాడు. ఫైనల్లో పేస్‌–షమస్దీన్‌ ద్వయం 2–6, 6–2, 10–8తో ‘సూపర్‌ టైబ్రేక్‌’లో బ్రిడాన్‌ క్లియెన్‌–జో సాలిస్‌బరీ (బ్రిటన్‌) జోడీపై గెలిచింది. 45 ఏళ్ల పేస్‌ ఈ సీజన్‌లో తలాసీ, లియోన్‌ ఏటీపీ చాలెంజర్‌ టోర్నీల్లోనూ టైటిల్స్‌ సాధించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement