
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) డబ్ల్యూ35 మహిళల టోర్నీలో హైదరాబాద్ ప్లేయర్ సహజ యామలపల్లి డబుల్స్ టైటిల్‌ను సాధించింది. డొమినికన్ రిపబ్లిక్ రాజధాని సాంటో డొమింగోలో జరిగిన ఈ టోర్నీలో సహజ (భారత్)–హిరోకో కువాటా (జపాన్) జోడీ డబుల్స్ విభాగంలో విజేతగా నిలిచింది.
ఫైనల్లో సహజ–హిరోకో ద్వయం 6–3, 6–2తో ఎస్తెర్ అడెషినా (బ్రిటన్)–సోఫియా ఎలీనా (వెనిజులా) జంటపై గెలిచింది. ఐటీఎఫ్ సర్క్యూట్‌లో సహజకిదే తొలి డబుల్స్ టైటిల్. సింగిల్స్ విభాగంలో ఆమె నాలుగు టైటిల్స్ సొంతం చేసుకుంది.