పాపం... పుజారా! | Ignored in IPL, Cheteshwar Pujara set to play for Yorkshire in county | Sakshi
Sakshi News home page

పాపం... పుజారా!

Published Thu, Apr 2 2015 2:26 AM | Last Updated on Sat, Sep 2 2017 11:42 PM

పాపం... పుజారా!

ముంబై: విదేశీ క్రికెటర్లంతా ఐపీఎల్ కోసం తమ దేశవాళీ క్రికెట్‌ను వదిలేసి రావాలని చూస్తారు. ఇంగ్లండ్ క్రికెటర్లు కూడా తమ కౌంటీల నుంచి అనుమతి తీసుకుని వచ్చి మరీ ఐపీఎల్ ఆడుతుంటారు. ఈ లీగ్‌లో ఉన్న డబ్బు మహత్యం ఇది. అయితే భారత క్రికెటర్ చతేశ్వర్ పుజారా మాత్రం ఐపీఎల్ సమయంలోనే కౌంటీ క్రికెట్ ఆడేందుకు ఇంగ్లండ్ వెళుతున్నాడు. గత సీజన్‌లో పంజాబ్ తరఫున ఆడిన పుజారాను ఈసారి ఆ జట్టు వదిలేసింది.

ఐపీఎల్-8 కోసం జరిగిన వేలంలోనూ ఎవరూ తనని తీసుకోలేదు. ఈలోగా ఇంగ్లండ్ కౌంటీ జట్టు యార్క్‌షైర్‌తో ఆడేందుకు అవకాశం వచ్చింది. సచిన్ తర్వాత యార్క్‌షైర్ తరఫున ఆడబోతున్న భారత క్రికెటర్ పుజారా. తొలుత పాకిస్తాన్ క్రికెటర్ యూనిస్‌ఖాన్‌తో యార్క్‌షైర్ ఒప్పందం కుదుర్చుకుంది. కానీ తను అందుబాటులో లేకపోవడంతో పుజారాను సంప్రదించారు. పాపం... భారత క్రికెటర్లంతా ఐపీఎల్‌తో కాసుల వర్షంలో తడుస్తుంటే పుజారా మాత్రం అలా ఇంగ్లండ్ వెళ్లాల్సివచ్చింది.

Advertisement
 
Advertisement
 
Advertisement