అమెరికాకు షాక్ ఇచ్చిన ఐసీసీ | ICC suspends United States membership | Sakshi
Sakshi News home page

అమెరికాకు షాక్ ఇచ్చిన ఐసీసీ

Jun 27 2015 6:23 PM | Updated on Apr 4 2019 5:12 PM

అమెరికాకు షాక్ ఇచ్చిన ఐసీసీ - Sakshi

అమెరికాకు షాక్ ఇచ్చిన ఐసీసీ

ప్రపంచ పెద్దన్న అమెరికాకు అంతర్జాతీయ క్రికెట్ సంఘం(ఐసీసీ) షాక్ ఇచ్చింది.

బార్బడోస్: ప్రపంచ పెద్దన్న అమెరికాకు అంతర్జాతీయ క్రికెట్ సంఘం(ఐసీసీ)  షాక్ ఇచ్చింది. ఐసీసీలో అమెరికా సభ్యత్వాన్ని రద్దు చేసింది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా క్రికెట్ అసోసియేషన్(యూఎస్ఏసీఏ) సభ్యత్వాన్ని రద్దు చేస్తూ ఐసీసీ బోర్డు ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది. ఇది వెంటనే అమల్లోకి వస్తుందని ప్రకటించింది. ఇటీవల నియమించిన సమీక్షా కమిటీ నివేదిక మేరకు ఐసీసీ స్పందించింది.

యూఎస్ఏసీఏ పాలన, ఆర్థిక విషయాలు, ప్రతిష్ట, క్రికెట్ కార్యకలాపాలపై సమీక్షా కమిటీ ఆందోళన వ్యక్తం చేయడంతో ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే యూఎస్ఏసీఏ సభ్యత్వాన్ని రద్దు చేసినా అమెరికా క్రికెటర్లకు ఎటువంటి నష్టం కలగనీయబోమని ఐసీసీ బోర్డు తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement