ఐసీసీ పోస్ట్‌: ధోనినా.. సర్ఫరాజా? | ICC asks whose catch was better Dhoni or Sarfaraz | Sakshi
Sakshi News home page

ఐసీసీ పోస్ట్‌: ధోనినా.. సర్ఫరాజా?

Jun 28 2019 6:37 PM | Updated on Jun 28 2019 6:37 PM

ICC asks whose catch was better Dhoni or Sarfaraz - Sakshi

కీపింగ్‌లో ధోనిని మించిన తోపు మరొకరు ఉండరు

మాంచెస్టర్‌:  టీమిండియా సీనియర్‌ ఆటగాడు, వికెట్‌ కీపర్‌ ఎంఎస్‌ ధోని కీపింగ్‌ నైపుణ్యం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వెలుతురు కంటే వేగంగా స్టంపౌట్‌లు చేయడం, కళ్లుచెదిరే రీతిలో క్యాచ్‌లు అందుకోవడం అతడికి వెన్నతో పెట్టిన విద్య. తాజాగా ప్రపంచకప్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో కార్లొస్‌ బ్రాత్‌వైట్‌ ఇచ్చిన క్యాచ్‌ను డైవ్‌ చేస్తూ ఒంటి చేత్తో అందుకోని ఔరా అనిపించాడు. అయితే ప్రస్తుతం ధోని క్యాచ్‌ వీడియో నెట్టింట్లో తెగ హల్‌చల్‌ చేస్తుండగానే.. ఐసీసీ ఈ వీడియోకు మరొకటి జతచేసి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది.

న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రాస్‌ టేలర్‌ ఇచ్చిన క్యాచ్‌ను పాకిస్తాన్‌ వికెట్‌ కీపర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ సూపర్‌గా డైవ్‌ చేస్తూ ఒంటిచేత్తో అందుకున్నాడు. అయితే రెండు క్యాచ్‌లు ఒకేలా పోలి ఉండటంతో ఐసీసీ రెండు వీడియోలను జత చేసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. అంతేకాకుండా ఎవరి క్యాచ్‌ అద్బుతంగా ఉందంటూ ఫ్యాన్స్‌ను ప్రశ్నించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ హల్‌చల్‌ చేస్తోంది. కీపింగ్‌లో ధోనిని మించిన తోపు మరొకరు ఉండరని నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement