రెండింటిలోనూ కోహ్లినే గ్రేట్‌: చాపెల్‌

Ian Chappell Picks Virat Kohli Over Steve Smith - Sakshi

సిడ్నీ: ఆసీస్‌ క్రికెటర్‌, మాజీ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ కంటే టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లినే అత్యుత్తమ ఆటగాడని ఆసీస్‌ దిగ్గజ ఆటగాడు ఇయాన్‌ చాపెల్‌ అభిప్రాయపడ్డాడు. ఇక్కడ కోహ్లి కేవలం ఆటగాడిగానే కాకుండా కెప్టెన్‌గానూ స్మిత్‌ కంటే అత్యుత్తమని పేర్కొన్నాడు. రోనా వైర‌స్ విజృంభ‌ణ‌తో విశ్వ‌వ్యాప్తంగా టోర్నీల‌న్నీ  ర‌ద్దుకావ‌డంతో ఇండ్ల‌కే ప‌రిమిమైన ఆట‌గాళ్లు, వ్యాఖ్య‌త‌లు సామాజిక మాధ్య‌మాల ద్వారా అభిమానుల‌ను అల‌రిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే చాపెల్ ట్విట్ట‌ర్ వేదిక‌గా త‌న అభిప్రాయాలు వ్య‌క్త‌ప‌రిచాడు. ఈఎస్‌పీఎన్‌ క్రిక్‌ ఇన్ఫో రౌనక్‌ కపూర్‌ అడిగిన ప్రశ్నకు చాపెల్‌ బదులిచ్చాడు. (‘ఇక టీమిండియాను ఓడించడమే లక్ష్యం’)

కోహ్లి, స్మిత్‌లలో ఒకరిని ఎంచుకోవాలని రౌనక్‌ కపూర్‌ అడగ్గా, కెప్టెన్‌గానా.. బ్యాట్స్‌మన్‌గానే అని చాపెల్‌ తిరిగి ప్రశ్నించాడు. అయితే రెండింటిలోనూ మీ అభిప్రాయం చెప్పండి అని కోరగా కోహ్లిని ఎంచుకున్నాడు చాపెల్‌. రెండు విభాగాల్లోనూ కోహ్లినే గ్రేట్‌ అంటూ పేర్కొన్నాడు. ఇటీవల కోహ్లి, ఏబీ డివిలియర్స్‌లే ప్రపంచ అత్యుత్తమ ఆటగాళ్లని న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ పేర్కొన్న సంగతి తెలిసిందే.  ప్రస్తుత క్రికెట్‌లో కోహ్లితో పాటు దక్షిణాఫ్రికా ఆటగాడు ఏబీ డివిలియర్స్‌లే అత్యుత్తమం అని విలియన్స్‌ పేర్కొన్నాడు.  ప్రస్తుత శకంలో కోహ్లి, డివిలియర్స్‌లే బెస్ట్‌ బ్యాట్స్‌మెన్‌ అని కొనియాడాడు. అన్ని ఫార్మాట్లలో ఆధిక్యం కనబరుస్తున్న కోహ్లినే ఒక అసాధారణ ఆటగాడన్నాడు. ఇక ఫ్రాంచైజీ క్రికెట్‌ ఆడుతున్న ఏబీ ఒక అరుదైన బ్యాట్స్‌మన్‌ అని విలియమ్సన్‌ తెలిపాడు. వీరిద్దరే ప్రస్తుతం అత్యుత్తమం అని కేన్‌ పేర్కొన్నాడు.  (హార్దిక్‌.. టాలెంట్‌ ఉంటే సరిపోదు!)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top