'డ్రెస్సింగ్ రూం విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నా' | i like to learn more about the inner workings, says Ricky Ponting | Sakshi
Sakshi News home page

'డ్రెస్సింగ్ రూం విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నా'

Jan 17 2015 3:26 PM | Updated on Sep 2 2017 7:49 PM

'డ్రెస్సింగ్ రూం విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నా'

'డ్రెస్సింగ్ రూం విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నా'

కెవిన్ పీటర్సన్ లాంటి ఆటగాడిని తొలగించడం ఇంగ్లండ్ చేసిన తప్పిదమని, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, కెప్టెన్ రికీ పాంటింగ్ అన్నాడు.

కెవిన్ పీటర్సన్ లాంటి ఆటగాడిని తొలగించడం ఇంగ్లండ్ చేసిన తప్పిదమని, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, కెప్టెన్ రికీ పాంటింగ్ అన్నాడు. ఇంగ్లండ్ డ్రెస్సింగ్ రూమ్లో జరిగే సంగతులను తెలుసుకోవాలన్న ఆసక్తి పెరిగిందన్నాడు. 'గత సోమవారం బీబీఎల్లో వ్యాఖ్యానం సందర్భంగా కెవిన్ను పలు ప్రశ్నలు అడిగే అవకాశం దొరికింది. కొన్ని విషయాలు అడగాలనిపించి, కేపీని కామెంటరీ బాక్స్కు పిలిచాను. కేపీ ఆత్మకథ చదివాను. అందులో కొన్ని విషయాలపై కేపీ తో చర్చిస్తే కొంత స్పష్టత వచ్చే అవకాశముంది.

ఆ విషయాలు నేను పూర్తిగా తెలుసుకునేందుకు మరోసారి అతడిని కలవాలనుకుంటున్నా' అని పాంటింగ్ అన్నారు. ఇంగ్లండ్ జట్టు కొత్త కెప్టెన్ ఇయాన్ మోర్గాన్  తోడ్పాటుతో తాను జట్టులోకి తిరిగి వచ్చే అవకాశం ఉందని కేపీ ఇటీవలే స్పష్టంచేశాడు. కేపీ తాను రచించిన 'కేపీ: ఆత్మకథ'లో ఇంగ్లండ్ డ్రెస్సింగ్ రూం వేధింపులను ప్రస్తావించిన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement