నామినేట్‌ చేసినందుకు మోదీకి థ్యాంక్స్‌ : మానికా బాత్రా

I am very happy For Nrendra Modi Nominated me, Says Manika Batra - Sakshi

న్యూఢిల్లీ : ఇటీవల కేంద్ర క్రీడలశాఖా మంత్రి రాజ్యవర్ధన్‌ రాథోడ్‌ ప్రారంభించిన ‘హమ్‌ ఫిట్‌ తో ఇండియా ఫిట్‌’కు విశేష స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ నేను సైతం అంటూ తన ఫిట్‌నెస్‌ వీడియోను పోస్ట్‌ చేశారు. నరేంద్ర మోదీ ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌పై భారత టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి మానికా బాత్రా స్పందించారు. ప్రధాని మోదీ స్థాయి వ్యక్తి తనకు ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌ విసరడం చాలా సంతోషంగా ఉందన్నారు. 

తనను గుర్తించి ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌కు నామినేట్‌ (ఆహ్వానించినందుకు) చేసినందుకు ప్రధానికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. మోదీ చేసిన ఈ ప్రయత్నం అందరికీ ఉపయోగకరమైనదని పేర్కొన్నారు. క్రీడాకారులతో పాటు ఇతరలుకు కూడా ఫిట్‌నెస్‌ అనేది చాలా ముఖ్యమని మానికా అభిప్రాయపడ్డారు. కర్ణాటక సీఎం కుమారస్వామి కూడా మోదీ ఛాలెంజ్‌ను స్వీకరించారు.

మహిళల టేబుల్ టెన్నిస్ సింగిల్స్‌లో స్వర్ణ పతకాన్ని అందించిన క్రీడాకారిణి మానికా బత్రా. కామన్వెల్త్ చరిత్రలో టేబుల్‌ టెన్నిస్‌ విభాగంలో భారత్‌ సాధించిన తొలి పతకం కావడం గమనార్హం. ఇటీవల ఆస్ట్రేలియాలో జరిగిన కామన్వెల్త్‌ గేమ్స్‌లో సింగపూర్ క్రీడాకారిణి మెయినగ్యు యూతో జరిగిన హోరాహోరీ పోరులో మానికా 11-7, 11-6, 11-2, 11-7 పాయింట్ల తేడాతో నెగ్గి స్వర్ణం కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. 

అతికొద్ది మందిలో మోదీ ఒకరు: రాజ్యవర్థన్‌ రాథోడ్‌
తాను ప్రారంభించిన హమ్‌ ఫిట్‌ తో ఇండియా ఫిట్‌’లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ తన ఫిట్‌నెస్‌ విడుదల చేయడంపై కేంద్ర క్రీడలశాఖా మంత్రి రాజ్యవర్ధన్‌ రాథోడ్‌ హర్షం వ్యక్తం చేశారు. ‘ప్రధాని తరచుగా యువత ఫిట్‌నెస్‌ గురించి మాట్లాడేవారు. యువత వల్ల దేశం మరింత అభివృద్ధి చెందుతుందని మోదీ భావించేవారు. ఇలాంటి ఫిట్‌నెస్‌ వీడియోలు షేర్‌ చేసే అతికొద్దిమంది ప్రధానులలో మోదీ ఒకరు. ఈ ప్రచారం మంచిధోరణిలో వెళ్తుంది. ఇందులో ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని’  రాజ్యవర్ధన్‌ రాథోడ్‌ వివరించారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top