హంపి, హారికలకు నిరాశ | Humpy, Harika to depression | Sakshi
Sakshi News home page

హంపి, హారికలకు నిరాశ

Dec 28 2016 12:13 AM | Updated on Sep 4 2017 11:44 PM

ప్రపంచ ర్యాపిడ్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్స్‌ కోనేరు హంపి, ద్రోణవల్లి హారికలకు పతకం నెగ్గే అవకాశాలు సంక్లిష్టం అయ్యాయి.

దోహా: ప్రపంచ ర్యాపిడ్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్స్‌ కోనేరు హంపి, ద్రోణవల్లి హారికలకు పతకం నెగ్గే అవకాశాలు సంక్లిష్టం అయ్యాయి. ఎనిమిదో రౌండ్‌ ముగిశాక హారిక 4 పాయింట్లతో 16వ స్థానంలో, హంపి 4 పాయింట్లతోనే 20వ స్థానంలో ఉన్నారు. మంగళవారం జరిగిన నాలుగు గేముల్లో హంపి మూడింటిని ‘డ్రా’ చేసుకొని, మరో గేమ్‌లో ఓడింది.

హారిక రెండు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని, ఒక గేమ్‌లో గెలిచి, మరో గేమ్‌లో ఓడిపోయింది. బుధవారం మరో నాలుగు గేమ్‌లు జరుగుతాయి. మరోవైపు ఓపెన్‌ విభాగంలో పదో రౌండ్‌ తర్వాత విశ్వనాథన్‌ ఆనంద్‌ 7 పాయింట్లతో ఐదో స్థానంలో ఉన్నాడు.
 

Advertisement
 
Advertisement
Advertisement