హంపి, హారిక గేమ్ ‘డ్రా’ | Humpy and Harika game 'draw' | Sakshi
Sakshi News home page

హంపి, హారిక గేమ్ ‘డ్రా’

Aug 9 2015 12:53 AM | Updated on Sep 3 2017 7:03 AM

ఆసియా కాంటినెంటల్ చెస్ చాంపియన్‌షిప్ ఓపెన్ విభాగంలో ఇద్దరు ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి,

అల్ అయిన్ (యూఏఈ) : ఆసియా కాంటినెంటల్ చెస్ చాంపియన్‌షిప్ ఓపెన్ విభాగంలో ఇద్దరు ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారికల మధ్య శనివారం జరిగిన ఏడో రౌండ్ గేమ్ 20 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిసింది. హంపి, హారిక ఇప్పటివరకు ఏడుసార్లు తలపడగా... ఆరుసార్లు ‘డ్రా’తో సరిపెట్టుకోగా, ఒకసారి హంపి గెలిచింది. లలిత్ బాబు,   అభిజిత్ కుంతేల గేమ్ 16 ఎత్తుల్లో డ్రా’ అయింది. ఏడో రౌండ్ తర్వాత హంపి, హారిక ఖాతాలో 4.5 పాయింట్లు ఉన్నాయి. ఇదే టోర్నీ మహిళల విభాగంలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి బొడ్డ ప్రత్యూష ఏడో రౌండ్‌లో 36 ఎత్తుల్లో థి ఎన్గుయెన్ (వియత్నాం)పై గెలిచింది.

Advertisement
 
Advertisement
Advertisement