హాకీ సెమీస్‌లో భారత్ | hockey team india entered in semi finals | Sakshi
Sakshi News home page

హాకీ సెమీస్‌లో భారత్

Aug 1 2014 1:26 AM | Updated on Sep 2 2017 11:10 AM

కామన్వెల్త్ గేమ్స్ పురుషుల హాకీలో భారత జట్టు సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. పూల్ ‘ఎ’లో భాగంగా గురువారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 5-2 తేడాతో విజయం సాధించింది.

గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్ పురుషుల హాకీలో భారత జట్టు సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. పూల్ ‘ఎ’లో భాగంగా గురువారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 5-2 తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు విజయాలతో పూల్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా తరువాత రెండో స్థానంలో నిలవడం ద్వారా సెమీస్‌కు అర్హత పొందింది.
 
  సఫారీలపై మ్యాచ్‌లో రఘునాథ్ (4వ నిమిషం), రూపిందర్‌పాల్ (8వ), రమణ్‌దీప్ సింగ్ (22వ), ఎస్.వి.సునీల్ (26వ)లు వరుసగా గోల్స్ సాధించడంతో తొలి అర్ధభాగంలోనే భారత్ 4-0 ఆధిక్యం సాధించింది. రెండో అర్ధభాగంలో దక్షిణాఫ్రికా రెండు గోల్స్ సాధించినా.. మన్‌ప్రీత్ సింగ్ 58వ నిమిషంలో భారత్‌కు మరో గోల్ అందించి ఆధిక్యాన్ని మరింత పెంచాడు. సెమీఫైనల్లో బారతజట్టు న్యూజిలాండ్‌తో తలపడతుంది.
 

Advertisement
 
Advertisement
Advertisement