సెరెనా మరో మైలురాయి | Historic Ranking Milestone For Serena | Sakshi
Sakshi News home page

సెరెనా మరో మైలురాయి

Jul 21 2015 12:05 AM | Updated on Sep 3 2017 5:51 AM

అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ మరో మైలురాయి చేరుకుంది...

న్యూయార్క్: అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ మరో మైలురాయి చేరుకుంది. డబ్ల్యూటీఏ సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో 250 వారాలపాటు నంబర్‌వన్ స్థానంలో కొనసాగిన నాలుగో ప్లేయర్‌గా గుర్తింపు పొందింది. స్టెఫీ గ్రాఫ్ (377 వారాలు), మార్టినా నవ్రతిలోవా (332 వారాలు), క్రిస్ ఎవర్ట్ (260 వారాలు) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. ఈ ఏడాది బరిలోకి దిగిన మూడు గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లోనూ (ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్) విజేతగా నిలిచిన సెరెనా, సెప్టెంబ రులో జరిగే యూఎస్ ఓపెన్‌లో క్యాలెండర్ గ్రాండ్‌స్లామ్ ఘనతపై గురి పెట్టింది.

Advertisement
 
Advertisement
Advertisement