హారికకు తొలి గెలుపు | hess tournament | Sakshi
Sakshi News home page

హారికకు తొలి గెలుపు

Feb 17 2016 1:36 AM | Updated on Sep 3 2017 5:46 PM

‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి చెస్ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక తొలి విజయాన్ని సాధించింది.

 టెహ్రాన్ (ఇరాన్): ‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి చెస్ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక తొలి విజయాన్ని సాధించింది. మంగళవారం జరిగిన ఐదో రౌండ్‌లో హారిక 28 ఎత్తుల్లో ప్రపంచ మాజీ చాంపియన్ అంటొనెటా స్టెఫనోవా (బల్గేరియా)ను ఓడించింది. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి నాలుగో ‘డ్రా’ నమోదు చేసుకుంది. పియా క్రామ్లింగ్ (స్వీడన్)తో జరిగిన ఐదో రౌండ్ గేమ్‌ను హంపి 54 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. ఐదో రౌండ్ తర్వాత హంపి మూడు పాయింట్లతో మూడో స్థానంలో, హారిక 2.5 పాయింట్లతో ఆరో స్థానంలో ఉన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement