చరిత్ర సృష్టించిన మహిళా షూటర్ హీనా సిద్ధూ | Heena Sidhu wins pistol gold in World Cup shooting | Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించిన మహిళా షూటర్ హీనా సిద్ధూ

Nov 11 2013 7:55 PM | Updated on Sep 2 2017 12:31 AM

భారత మహిళా షూటర్ హీనా సిద్ధూ చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్‌ఎస్‌ఎఫ్) ప్రపంచ కప్ ఫైనల్స్ టోర్నమెంట్‌లో స్వర్ణ పతకం నెగ్గిన తొలి భారతీయ పిస్టల్ షూటర్‌గా ఆమె గుర్తింపు పొందింది.

ముంబై: భారత మహిళా షూటర్ హీనా సిద్ధూ చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్‌ఎస్‌ఎఫ్) ప్రపంచ కప్ ఫైనల్స్ టోర్నమెంట్‌లో స్వర్ణ పతకం నెగ్గిన తొలి భారతీయ పిస్టల్ షూటర్‌గా ఆమె గుర్తింపు పొందింది. జర్మనీలోని మ్యూనిచ్‌లో జరుగుతున్న ఈ సీజన్ ముగింపు టోర్నమెంట్‌లో హీనా సిద్ధూ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది.
 గతంలో భారత్ నుంచి అంజలి భగవత్ (2002లో), గగన్ నారంగ్ (2008లో) రైఫిల్ ఈవెంట్‌లో ఈ ఘనత సాధించారు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టాప్-10 షూటర్లు మాత్రమే పాల్గొనే ఈ టోర్నీలో హీనా విశేషంగా రాణించింది.

 

స్వర్ణ పతకాన్ని నెగ్గే క్రమంలో ఈ పంజాబ్ అమ్మాయి ‘డబుల్ ఒలింపిక్ చాంపియన్’ గువో వెన్‌జున్ (చైనా)... ప్రపంచ చాంపియన్ అరునోవిచ్ జొరానా (సెర్బియా)... రెండుసార్లు ఒలింపిక్స్‌లో పతకాలు నెగ్గిన ఒలెనా కొస్టెవిచ్ (ఉక్రెయిన్)లను ఓడించింది. క్వాలిఫయింగ్‌లో

Advertisement
 
Advertisement
Advertisement