
సాక్షి, హైదరాబాద్: హెచ్‌సీఏ రెండు రోజుల క్రికెట్ లీగ్‌లో బ్రదర్స్ ఎలెవెన్ జట్టు బ్యాట్స్‌మన్ హర్షవర్ధన్ సింగ్ దుమ్మురేపాడు. మంగళవారం ఉస్మానియాతో మొదలైన ఈ మ్యాచ్‌లో అతడు ఏకంగా ద్విశతకం (252 బంతుల్లో 201 నాటౌట్; 27 ఫోర్లు, 4 సిక్స్‌లు)తో కదంతొక్కాడు. దీంతో బ్రదర్స్ ఎలెవెన్ జట్టు 90 ఓవర్లలో 9 వికెట్లకు 409 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ సీజన్‌లో హర్షవర్ధన్ నిలకడగా రాణిస్తున్నాడు. అతని ఖాతాలో మూడు సెంచరీలు, ఒక డబుల్ సెంచరీ చేరాయి. గత మ్యాచ్‌ల్లో పీకేఎంసీసీపై (111), జాన్సన్ స్కూల్ (102 నాటౌట్), హైదరాబాద్ టైటాన్స్ (101 నాటౌట్) అతను సెంచరీలు సాధించాడు. ఓపెనర్ మణికంఠ (89 బంతుల్లో 92; 9 ఫోర్లు, 7 సిక్స్‌లు) శతకాన్ని చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు.