సెమీస్‌లో హెచ్‌సీఏ ఎలెవన్‌ | HCA enters semis in Moin ud dowlah gold cup cricket tourney | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో హెచ్‌సీఏ ఎలెవన్‌

Aug 29 2017 10:46 AM | Updated on Sep 12 2017 1:17 AM

ఆలిండియా మొయినుద్దౌలా గోల్డ్‌ కప్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌లో హెచ్‌సీఏ ఎలెవన్‌ సెమీఫైనల్‌కు చేరుకుంది.

మొయినుద్దౌలా గోల్డ్‌ కప్‌ క్రికెట్‌ టోర్నీ

సాక్షి, హైదరాబాద్‌: ఆలిండియా మొయినుద్దౌలా గోల్డ్‌ కప్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌లో హెచ్‌సీఏ ఎలెవన్‌ సెమీఫైనల్‌కు చేరుకుంది. హెచ్‌సీఏతో పాటు బరోడా సీఏ, ఎయిరిండియా, ఆంధ్రా కోల్ట్స్‌ జట్లు కూడా సెమీస్‌లో అడుగుపెట్టాయి. ఎన్‌ఎఫ్‌సీ గ్రౌండ్స్‌లో జరిగే తొలి సెమీస్‌లో హెచ్‌సీఏ ఎలెవన్‌తో బరోడా సీఏ, రాజీవ్‌గాంధీ స్టేడియంలో జరిగే రెండో సెమీస్‌లో ఎయిరిండియాతో ఆంధ్రా కోల్ట్స్‌ తలపడతాయి. ఇదిలా ఉండగా సోమవారం జరగాల్సిన రౌండ్‌–5 లీగ్‌ మ్యాచ్‌లు వర్షం కారణంగా తుడిచిపెట్టుకుపోయాయి.

 

గ్రూప్‌ ‘ఎ’లో హెచ్‌సీఏ ఎలెవన్‌ జట్టుకు విదర్భ సీఏ వాకోవర్‌ ఇవ్వడంతో హెచ్‌సీఏ ఖాతాలో 4 పాయింట్లు చేరాయి. ఈ విభాగంలో కాగ్, గోవా సీఏ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు కావడంతో ఇరు జట్లకు చెరో 2 పాయింట్లు లభించాయి. గ్రూప్‌ ‘బి’ కేటగిరీలోనూ ఎయిరిండియాతో కేరళ సీఏ, బరోడా సీఏతో హెచ్‌సీఏ ప్రెసిడెంట్స్‌ ఎలెవన్‌ తలపడాల్సి ఉండగా వర్షం కారణంగా ఈ మ్యాచ్‌లు జరగలేదు. దీంతో ప్రతీ జట్టుకు తలో 2 పాయింట్లు లభించాయి. లీగ్‌ మ్యాచ్‌ల అనంతరం రెండు గ్రూపుల్లోనూ తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌ పోరుకు అర్హత సాధించాయి.   

 

Advertisement
 
Advertisement
Advertisement