హర్షీల్‌కు డచ్‌ ఓపెన్‌ టైటిల్‌ | Harsheel Dani Clinches Dutch International Badminton Title | Sakshi
Sakshi News home page

హర్షీల్‌కు డచ్‌ ఓపెన్‌ టైటిల్‌

Apr 16 2019 3:30 PM | Updated on Apr 16 2019 3:30 PM

Harsheel Dani Clinches Dutch International Badminton Title - Sakshi

న్యూఢిల్లీ: భారత యువ షట్లర్‌ హర్షీల్‌ డాని ఈ ఏడాది తొలి అంతర్జాతీయ టైటిల్‌ సాధించాడు. డచ్‌ ఓపెన్‌ టోర్నమెంట్‌లో అతను విజేతగా నిలిచాడు. ఫైనల్లో హర్షీల్‌ 15–21, 21–12, 21–13తో మాడ్స్‌ క్రిస్టోఫెర్సన్‌ (డెన్మార్క్‌)పై విజయం సాధించాడు.

చీలమండ గాయం కారణంగా గతేడాది ఎనిమిది నెలలపాటు ఆటకు దూరంగా ఉన్న హర్షీల్‌ ఈ ఏడాది మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. ఫైనల్‌ చేరే క్రమంలో ఒక్క గేమ్‌ కూడా కోల్పోని హర్షీల్‌కు తుది పోరులో గట్టిపోటీనే లభించింది. తొలి గేమ్‌ చేజార్చుకున్నప్పటికీ నిరాశ చెందని హర్షీల్‌ రెండో గేమ్‌ నుంచి పుంజుకున్నాడు. ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. 

Advertisement
 
Advertisement
Advertisement