హారిక మూడో విజయం | Harika third victory | Sakshi
Sakshi News home page

హారిక మూడో విజయం

Apr 22 2017 1:33 AM | Updated on Sep 5 2017 9:20 AM

రెక్జావిక్‌ (ఐస్‌లాండ్‌) ఓపెన్‌ అంతర్జాతీయ చెస్‌ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ ద్రోణవల్లి హారిక మూడో విజయం

న్యూఢిల్లీ: రెక్జావిక్‌ (ఐస్‌లాండ్‌) ఓపెన్‌ అంతర్జాతీయ చెస్‌ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ ద్రోణవల్లి హారిక మూడో విజయం సాధించింది. శుక్రవారం మార్టిన్‌ బరోస్‌ (ఇంగ్లండ్‌)తో జరిగిన నాలుగో గేమ్‌లో తెల్లపావులతో ఆడిన హారిక 30 ఎత్తుల్లో గెలిచింది.

నాలుగో రౌండ్‌ తర్వాత హారిక 3.5 పాయింట్లతో మరో ఐదుగురితో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో ఉంది.  భారత్‌కే చెందిన విదిత్‌ సంతోష్‌ గుజరాతి, అభిజిత్‌ గుప్తా నాలుగేసి పాయింట్లతో ఉమ్మడిగా అగ్రస్థానంలో ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement