కార్పొవ్‌ను నిలువరించిన హారిక | Harika karpovnu niluvarincina | Sakshi
Sakshi News home page

కార్పొవ్‌ను నిలువరించిన హారిక

Oct 25 2016 12:01 AM | Updated on Sep 4 2017 6:11 PM

కార్పొవ్‌ను   నిలువరించిన హారిక

కార్పొవ్‌ను నిలువరించిన హారిక

అనతోలి కార్పొవ్ ట్రోఫీ అంతర్జాతీయ ఓపెన్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక .

క్యాప్ డి అగ్డె (ఫ్రాన్‌‌స): అనతోలి కార్పొవ్ ట్రోఫీ అంతర్జాతీయ ఓపెన్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక స్ఫూర్తిదాయక ప్రదర్శన కొనసాగుతోంది. రష్యా చెస్ దిగ్గజం, ప్రపంచ మాజీ చాంపియన్ అనతోలి కార్పొవ్‌తో సోమవారం జరిగిన ఏడో రౌండ్ గేమ్‌ను హారిక 51 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది.

ఈ టోర్నీలో హారికకిది నాలుగో ‘డ్రా’ కావడం విశేషం. ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఆరో రౌండ్ గేమ్‌ను హారిక, మేరీ సెబాగ్ (ఫ్రాన్‌‌స) 54 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నారు. మొత్తం ఎనిమిది మంది మధ్య డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో ఈ టోర్నీ జరుగుతోంది. లీగ్ దశ తర్వాత తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన వారు సెమీఫైనల్స్‌కు అర్హత సాధిస్తారు. 

 

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement