హారిక ఓటమి | Harika defeat | Sakshi
Sakshi News home page

హారిక ఓటమి

May 13 2017 12:29 AM | Updated on Sep 5 2017 11:00 AM

టెపి సిజ్‌మన్‌ ఓపెన్‌ అంతర్జాతీయ చెస్‌ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ ద్రోణవల్లి హారికకు తొలి పరాజయం

మాల్మో (స్వీడన్‌): టెపి సిజ్‌మన్‌ ఓపెన్‌ అంతర్జాతీయ చెస్‌ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ ద్రోణవల్లి హారికకు తొలి పరాజయం ఎదురైంది. ఎరిక్‌ బ్లోమ్‌విస్ట్‌ (స్వీడన్‌)తో శుక్రవారం జరిగిన మూడోరౌండ్‌ గేమ్‌లో తెల్లపావులతో ఆడి కూడా ప్రయోజనం పొందలేకపోయింది.

చివరకు ఆమె 50 ఎత్తుల్లో పరాజయం పాలైంది. ఆరుగురు గ్రాండ్‌మాస్టర్ల మధ్య రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ పద్ధతిలో జరుగుతోన్న ఈ టోర్నీలో హారిక తొలి రెండు గేమ్‌లను ‘డ్రా’ గా ముగించింది.

Advertisement
 
Advertisement
Advertisement