పాం‍డ్యా కామెంట్‌కు క్రికెటర్‌ భార్య సెటైర్‌!

Hardik Pandya Expresses Love For Dinesh Karthik - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దినేష్‌ కార్తిక్‌, అతని భార్య దీపికా పల్లికల్ మధ్యలోకి ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా వచ్చాడు. దీంతో దీపికాకు కోపమొచ్చింది. హార్దిక్‌ చేసిన పనికి వ్యంగ్యంగా ఆమె సమాధానామిచ్చారు. ఇంతకీ విషయమేంటంటే..  డీకే, హర్దిక్‌లు మంచి స్నేహితులు అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇటీవల జరిగిన ఓ టీవీ ఇంటర్యూలో కూడా తాను ఎక్కువ సమయం హార్దిక్‌ పాండ్యా, కేఎల్‌ రాహుల్‌తోనే గడుపుతానని కార్తిక్‌ చెప్పాడు.
 
అయితే, కార్తిక్‌తో తనకున్న స్నేహబంధాన్ని వెల్లడిస్తూ... ‘నా మొదటి లవ్‌ డీకేతోనే’ అంటూ హార్దిక్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫొటో పోస్టు చేశాడు. హార్ట్‌ సింబల్‌ను సైతం జత చేశాడు. దీనిపై స్పందించిన కార్తిక్‌ భార్య ‘సరే.. నా స్థానాన్ని చక్కగా భర్తీ చేశారు. చాలా థాంక్స్‌’  అంటూ కామెంట్‌ చేశారు. కాగా, వృద్ధిమాన్‌ సాహాకు గాయం కారణంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న అయిదు మ్యాచ్‌లో టెస్ట్‌ సిరీస్‌కి దినేష్‌ కార్తిక్‌ ఎంపికయ్యాడు. ఎడ్జ్‌బాస్టన్‌లో బుధవారం జరుగుతున్న మొదటి టెస్టులో టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ జట్టు బ్యాటింగ్‌ ఎంచుకుంది.

My no. 1 love ❤️ @dk00019

A post shared by Hardik Pandya (@hardikpandya93) on

 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top