నిరాశపరిచిన భారత రెజ్లర్లు | Greco Roman grapplers disappoint after freestyle success | Sakshi
Sakshi News home page

నిరాశపరిచిన భారత రెజ్లర్లు

Sep 30 2014 6:51 PM | Updated on Sep 2 2017 2:11 PM

ఫ్రీ స్టయిల్ విభాగంలో దుమ్ము భారత రెజ్లర్లు గ్రీకో రోమన్‌లో మాత్రం నిరాశ పరిచారు.

ఇంచియాన్:ఫ్రీ స్టయిల్ విభాగంలో దుమ్ము భారత రెజ్లర్లు గ్రీకో రోమన్‌లో మాత్రం నిరాశ పరిచారు. కృష్ణకాంత్ యాదవ్ కాంస్య పతక  పోరులో 0-3తో ఇరాన్ రెజ్లర్ సయూద్ చేతిలో ఓడాడు.  ఇక రవీందర్ సింగ్, హర్‌ప్రీత్ సింగ్ క్వార్టర్ ఫైనల్ బౌట్‌లో ఓడి ఇంటిదారి పట్టారు.  ఇదిలా ఉండగా టేబుల్ టెన్నిస్ పురుషుల డబుల్స్‌లో భారత జోడీలు శరత్ కమల్- ఆంథోని అమల్‌రాజ్,  హర్మీత్ దేశాయ్-సౌమ్యజిత్ ఘోష్  తమ ప్రత్యర్థులపై గెలిచి  మూడో రౌండ్‌లోకి ప్రవేశించారు.

 

మిక్స్‌డ్ డబుల్స్ ప్రి క్వార్టర్స్‌లో అమల్‌రాజ్-మాధురిక ద్వయుం, జపాన్ జంటపై నెగ్గి క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టారు. షూటింగ్ లో మైరాజ్ అహ్మద్ ఖాన్ స్కీట్ వ్యక్తిగత విభాగంలో కొద్దిలో కాంస్య పతకాన్ని చేజార్చుకున్నాడు. సెమీఫైనల్లో తను ఐదో స్థానంలో నిలిచాడు.

Advertisement
 
Advertisement
Advertisement