లారా రికార్డును సమం చేసిన బెయిలీ | George Bailey equals Brian Lara record | Sakshi
Sakshi News home page

లారా రికార్డును సమం చేసిన బెయిలీ

Dec 16 2013 1:17 PM | Updated on Sep 2 2017 1:41 AM

టెస్టుల్లో ఒక ఓవర్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డును ఆస్ట్రేలియా ఆటగాడు జార్జి బెయిలీ సమం చేశాడు.

పెర్త్: టెస్టుల్లో ఒక ఓవర్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డును ఆస్ట్రేలియా ఆటగాడు జార్జి బెయిలీ సమం చేశాడు. యాషెస్ సిరిస్లో భాగంగా మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్లో అతడీ ఘనత సాధించాడు. ఆట నాలుగు రోజు ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ డిక్లేర్ చేసే ముందు ఇంగ్లండ్ బౌలర్ జిమ్మీ ఆండర్సన్ వేసిన ఓవర్లో 28 పరుగులు రాబట్టాడు. మూడు సిక్సర్లు, రెండు ఫోర్లు బాదాడు. వన్డే ఆటగాడిగా ముద్రపడిన బెయిలీ మూడో టెస్టులోనే ఈ ఫీట్ సాధించాడు.

ఇప్పటివరకు ఈ రికార్డు వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం బ్రియన్ లారా పేరు మీద కొనసాగుతోంది. జోహెన్నెస్బర్గ్లో 2003లో దక్షిణాఫ్రికాపై ఈ ఘనత సాధించాడు. రాబిన్ పీటర్సన్ వేసిన ఓవర్లో 28 పరుగులు సాధించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement