అనుష్కను వెనకేసుకొచ్చిన గీతా బస్రా | Geeta Basra feels it is unfair to blame Anushka Sharma | Sakshi
Sakshi News home page

అనుష్కను వెనకేసుకొచ్చిన గీతా బస్రా

Aug 25 2014 8:41 AM | Updated on Sep 2 2017 12:26 PM

అనుష్కను వెనకేసుకొచ్చిన గీతా బస్రా

అనుష్కను వెనకేసుకొచ్చిన గీతా బస్రా

భారత క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న బాలీవుడ్ భామ అనుష్క శర్మను హర్భజన్ సింగ్ ప్రియురాలు గీతా బస్రా వెనకేసుకొచ్చింది.

భారత క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న బాలీవుడ్ భామ అనుష్క శర్మను హర్భజన్ సింగ్ ప్రియురాలు గీతా బస్రా వెనకేసుకొచ్చింది. అనుష్క కారణంగానే కోహ్లి విఫలమయ్యాడనడాన్ని బస్రా కొట్టిపారేసింది. క్రికెటర్ల వైఫల్యాలకు వారి భార్యలను, ప్రియురాళ్లను నిందించడం సరికాదని బస్రా పేర్కొంది.

ఆటగాళ్లు క్రీడా జీవితంలో ఎత్తు పల్లాలు సహజమని, దీనికి మరొకరిని బలిపశువులు చేయడం అన్యాయని బస్రా వ్యాఖ్యానించింది. కోహ్లి వైఫల్యానికి అనుష్కపై నిందలు వేయడం హాస్యాస్పదంగా ఉందని పేర్కొంది. ఇంగ్లండ్ సిరీస్ లో విఫలమవడంతో కోహ్లి, అనుష్క జంటపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అనుష్కను ఇంగ్లండ్ తీసుకెళ్లడం వల్లే కోహ్లి విఫలమయ్యాడన్న ఆరోపణలు ఊపందుకున్నాయి.

 

Advertisement
 
Advertisement
Advertisement