క్రిస్ గేల్ గోల్డెన్ డక్ | gayle lost his wicket as golden | Sakshi
Sakshi News home page

క్రిస్ గేల్ గోల్డెన్ డక్

May 7 2017 4:15 PM | Updated on Sep 5 2017 10:38 AM

క్రిస్ గేల్ గోల్డెన్ డక్

క్రిస్ గేల్ గోల్డెన్ డక్

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10లోభాగంగా ఇక్కడ ఆదివారం నగరంలోని చిన్నస్వామి స్టేడియంలో కోల్ కతా నైట్ రైడర్స్ తోజరుగుతున్న మ్యాచ్ లోరాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్ క్రిస్ గేల్ గోల్డెన్ డక్ గా పెవిలియన్ చేరాడు.

బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10లోభాగంగా ఇక్కడ ఆదివారం నగరంలోని చిన్నస్వామి స్టేడియంలో కోల్ కతా నైట్ రైడర్స్ తోజరుగుతున్న మ్యాచ్ లోరాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్ క్రిస్ గేల్ గోల్డెన్ డక్ గా పెవిలియన్ చేరాడు. కోల్ కతా పేసర్ ఉమేశ్ యాదవ్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్ మొదటి బంతికే గేల్ గోల్డెన్ డకౌటయ్యాడు. దాంతో స్కోరు బోర్డుపై పరుగులేమీ లేకుండానే ఆర్సీబీ తొలి వికెట్ ను నష్టపోయింది.

 

కింగ్స్ పంజాబ్ తో జరిగిన గత మ్యాచ్ లోసైతం గేల్ డకౌటైన సంగతి తెలిసిందే.ఈ మ్యాచ్ లో కోల్ కతా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో ఆర్సీబీ ముందుగా బ్యాటింగ్ చేపట్టింది. ఇప్పటికే నాకౌట్  పోరు నుంచి నిష్ర్కమించిన ఆర్సీబీకి ఇది నామమాత్రపు మ్యాచ్. మరొకవైపు కోల్ కతా విజయం సాధిస్తే ప్లేఆఫ్ అవకాశాలు మెరుగవుతాయి.


 

Advertisement
 
Advertisement
Advertisement