ఫ్రెంచ్‌ ఓపెన్‌: షరపోవా ‘ఖేల్‌’ ఖతం | Garbine Muguruza Beats Maria Sharapova In French Open | Sakshi
Sakshi News home page

Jun 6 2018 7:39 PM | Updated on Jun 6 2018 8:09 PM

Garbine Muguruza Beats Maria Sharapova In French Open - Sakshi

గార్బిన్‌ ముగురుజా, మారియా షరపోవా

పారిస్‌ : ఎన్నో ఆశలతో  ఫ్రెంచ్‌ ఓపెన్‌లో అడుగుపెట్టిన రష్యా టెన్నిస్‌ స్టార్‌, మాజీ చాంపియన్‌ మారియా షరపోవాకు నిరాశే ఎదురైంది. మూడో సీడ్‌, స్పెయిన్‌ స్టార్ గార్బిన్‌ ముగురుజాతో గురువారం జరిగిన మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో షరపోవా 6-2,6-1 తేడాతో పరాజయం పాలైంది. వరుస సెట్‌లలో షరపోవాపై ముగురుజా సునాయస విజయం సాధించింది. ప్రిక్వార్టర్‌ ఫైనల్లో మాజీ చాంపియన్‌ సెరెనా విలియమ్స్‌ భుజం కండరాలు పట్టేయడంతో షరపోవాకు వాకోవర్‌ ఇచ్చింది. దీంతో ఈ మ్యాచ్‌ ఆడకుండానే షరపోవా క్వార్టర్‌ఫైనల్‌కు చేరిన విషయం తెలిసింది.
 

హలెప్‌ హవా..
ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంక్‌ అందుకున్నా... ఎంతోకాలంగా ఊరిస్తోన్న గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను ఈసారైనా నెగ్గాలనే పట్టుదలతో ఉన్న సిమోనా హలెప్‌ తన హవా కొనసాగిస్తోంది. జర్మనీ క్రీడాకారిణి ఎంజెలిక్‌ కెర్బర్‌తో జరిగిన మరో క్వార్టర్‌ ఫైనల్లో హలెప్‌ 6-2(2/7), 6-3, 6-2 తేడాతో విజయం సాధించింది. ఇక హలెప్‌ సెమీ ఫైనల్లో స్పెయిన్‌ స్టార్ గార్బిన్‌ ముగురుజాతో తలపడనుంది. 

Advertisement
 
Advertisement
Advertisement