‘ఇంకా ఆట ముగిసిపోలేదు’

Game Is Not Yet over Graham Thorpe - Sakshi

లీడ్స్‌:  యాషెస్‌ సిరీస్‌ తొలి టెస్టులో ఆస్ట్రేలియా విజయం సాధించగా, రెండో టెస్టు డ్రాగా ముగిసింది. ఇక మూడో టెస్టు రసవత్తరంగా మారింది. ఆసీస్‌ తన తొలి ఇన్నింగ్స్‌లో 179 పరుగులకు ఆలౌటైతే, ఇంగ్లండ్‌ తన మొదటి ఇన్నింగ్స్‌లో 27.5 ఓవర్లు మాత్రమే ఆడి 67 పరుగులకే చాపచుట్టేసింది. ఇది టెస్టు క్రికెట్‌ చరిత్రలో 12వ స్వల్ప స్కోరు కాగా, 1948 తర్వాత ఆసీస్‌పై ఇంగ్లండ్‌కు ఇదే అత్యల్పం.

కాగా,  మ్యాచ్‌పై ఆశలు కోల్పోవద్దని ఇంగ్లండ్‌కు దిశా నిర్దేశం చేస్తున్నాడు ఆ జట్టు బ్యాటింగ్‌ కోచ్‌ గ్రాహమ్‌ థోర్ప్‌. ‘ ఇంకా మ్యాచ్‌ చాలా ఉంది. గేమ్‌ అప్పుడే ఆసీస్‌ చేతుల్లోకి వెళ్లిపోయిందనే భయాన్ని వీడండి. మూడో రోజు ఆటలో ఆసీస్‌ను కట్టడి చేస్తే మనదే పైచేయి అవుతుంది. గతంలో ఇక్కడ మూడొందల టార్గెట్‌ను ఛేదించిన సందర్భాలున్నాయనే విషయాన్ని మరవకండి. నమ్మకమే గెలుపు.  ఆత్మవిశ్వాసంతో పోరాడండి’ అని ఇంగ్లండ్‌ను గాడిలో పెట్టే పనిలో పడ్డాడు థోర్ప్‌.

ప్రస్తుతం ఆస్ట్రేలియా 283 పరుగుల ఆధిక్యంలో ఉంది. తన రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఆసీస్‌ రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్లు కోల్పోయి 171 పరుగులతో ఉంది. క్రీజ్‌లో లబుషేన్‌(53 బ్యాటింగ్‌), జేమ్స్‌ పాటినసన్‌(2 బ్యాటింగ్‌)లు ఉన్నారు. (ఇక్కడ చదవండి: ఇంగ్లండ్‌ 67కే ఆలౌట్‌)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top